TS inter second year exams cancelled, Sabitha Indra Reddy official statement: హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌పై నెలకొన్న సందిగ్ధానికి తెరదించుతూ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.. ఫలితాల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని తెలిపారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పిన ఆమె.. ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు.
కరోనావైరస్ సెకండ్ వేవ్ (Coronavirus second wave) వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ణా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకే ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న అనారోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులపై ఒత్తిడి పడకూడదనే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసేందుకే మొగ్గు చూపినట్లు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.
Also read : HMRL timings, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లో మార్పులు
అంతకంటే ముందు ఓసారి మంత్రి సబితా ఇంద్రా రెడ్డి (Minister Sabitha Indra Reddy) మాట్లాడుతూ.. పరీక్షలు రద్దు కాలేదు. రద్దు నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాం అని ప్రకటించడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటర్మీడియెట్ సెకండీయర్ విద్యార్థులు (TS Inter students), వారి తల్లిదండ్రులు అయోమయానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ సందేహాలకు సమాధానం ఇస్తూ మరోసారి మంత్రి సబితనే పరీక్షల రద్దుపై (TS Inter second year exams cancelled) ప్రకటన చేయడంతో అందరికీ స్పష్టత వచ్చింది.
Also read : Good news for farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు MSP పెంచిన కేంద్రం
Also read : AP CM YS Jagan's Delhi tour: ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook