Corona Dead Bodies in Ganga River: గంగానదిలో కరోనా మృతదేహాలు, ఉత్తరాదిన కలకలం

Corona Dead Bodies in Ganga River: ఓ వైపు కరోనా ఉధృతి భయం గొలుపుతుంటే..వందలాది కరోనా మృతదేహాలు నదిలో పడి ఉండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. తెల్లటి వస్త్రాలు కప్పిన కరోనా మృతదేహాలు వందల సంఖ్యలో ఉండటం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 10, 2021, 05:02 PM IST
Corona Dead Bodies in Ganga River: గంగానదిలో కరోనా మృతదేహాలు, ఉత్తరాదిన కలకలం

Corona Dead Bodies in Ganga River: ఓ వైపు కరోనా ఉధృతి భయం గొలుపుతుంటే..వందలాది కరోనా మృతదేహాలు నదిలో పడి ఉండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. తెల్లటి వస్త్రాలు కప్పిన కరోనా మృతదేహాలు వందల సంఖ్యలో ఉండటం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది.

దేశంలో కరోనా పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క వార్త చాలు. పవిత్రమైన గంగానదీలో వందలాది కరోనా మృతదేహాలు పడి ఉన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్, బీహార్‌లోని బక్సార్ జిల్లాలో ప్రవహిస్తున్న గంగానది(Ganga River) చెంతన ఈ ఘోర దృశ్యం కన్పించింది. యుపీలో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలకు అంత్యక్రియలు చేసే స్మశానం కూడా లేకపోవడం, కుటుంబసభ్యులు నిరాకరించడంతో విధిలేని పరిస్థితుల్లో కొందరు ఇలా మృతదేహాల్ని పడవేస్తున్నారని తెలుస్తోంది. యూపీలోనే కాదు అటు బీహార్( Bihar) గంగానదిలో కూడా ఇలాగే మృతదేహాలు కన్పిస్తున్నాయి. గంగానదిలో మూడు, నాలుగు కిలోమీటర్ల వరకూ వందకు పైగా కరోనా మృతదేహాల్ని(Corona Dead Bodies) అధికారులు గుర్తించారు. 

గంగానదిలో మృతదేహాలు తేలడంపై యూపీ( Uttar pradesh) హమీర్‌పూర్ పోలీసులు స్పందించారు. హమీర్‌పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాల్ని కాల్చడం గానీ, పూడ్చడం గానీ చేయరని..అలా నదిలో పడవేస్తారని అంటున్నారు. అందుకే అప్పుడప్పుడూ ఇలాంటి మృతదేహాలు కన్పిస్తాయని వెల్లడించారు. ఇప్పుడు మాత్రం కరోనా భయంతో చాలామంది అంత్యక్రియలు చేసేందుకు భయపడుతూ మృతదేహాల్ని నది నీటిలో పడవేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకూ 150కు పైగా మృతదేహాలు లభ్యమయ్యాయంటున్నారు.

Also read: COVID-19 Cases: భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News