The Lancet Report: కళ్లు తెరవకపోతే పెను ముప్పే..లాన్సెట్ తీవ్ర హెచ్చరిక

The Lancet Report: దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంపై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి. లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో అంతటి దారుణ పరిస్థితి నెలకొనబోతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2021, 01:13 PM IST
The Lancet Report: కళ్లు తెరవకపోతే పెను ముప్పే..లాన్సెట్ తీవ్ర హెచ్చరిక

The Lancet Report: దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంపై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి. లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో అంతటి దారుణ పరిస్థితి నెలకొనబోతోంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తుండటంపై పలు సంస్థల్నించి వెలువడుతున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇండియాలో నెలకొన్న కరోనా అధ్వాన్న పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ సంచలన విషయాలు ప్రకటించింది. ఆగస్టు 1 వ తేదీ నాటికి కరోనా కారణంగా ఇండియాలో 10 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా వేస్తోంది. మే 4 వ తేదీ నాటికి ఇండియాలో 2 కోట్లకు పైగా కేసులు చేరుకోవడం, పెరుగుతున్న మరణాల్ని గుర్తు చేసింది.

ఇప్పటికైనా సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1వ తేదీ నాటికి 10 లక్షలమంది మరణిస్తారని ఇనిస్టిట్యూట్ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అంచనా వేసిందని ది లాన్సెట్‌ ( The lancet) తెలిపింది. ఒకవేళ ఇదే జరిగితే ఈ జాతీయ విపత్తుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ( Modi Government) బాధ్యత వహించాలని పేర్కొంది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో విమర్శలకు తొక్కిపెట్టడానికి, ప్రయత్నించిన తీరు కూడా క్షమించరానిదని లాన్సెట్ వ్యాఖ్యానించింది. దేశంలో కోవిడ్‌-19 అత్యవసర పరిస్థితులున్నాయని తెలిపింది.ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయని.. మందులు, బెడ్లు, ఆక్సిజన్‌ అందక (Oxygen Shortage) రోగులు అష్ట కష్టాలు పడుతున్నారని లాన్సెట్ వెల్లడించింది. చివరికి  చికిత్స అందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు కోవిడ్‌ నియంత్రణకు మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని మండిపడింది. ఏప్రిల్‌ వరకు కూడా కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో సమావేశం కాలేదంటేనే ప్రభుత్వ నిబద్దత ఎలా ఉందో అర్ధమౌతోందని చురకలు వేసింది.

కేంద్ర ప్రభుత్వ(Central government)నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ సంక్షోభం ఏర్పడిందని..అనేక హెచ్చరికలు, సంకేతాలు ఉన్నప్పటికీ మతపరమైన ఉత్సవాలైన కుంభమేళా, రాజకీయ ర్యాలీలు వంటి సూపర్-స్ప్రెడర్ కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతించిందని ఆగ్రహం వ్యక్తం  చేసింది. అలాగే కేంద్రంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విటర్‌కు ఆదేశాలు ఇచ్చిందని పేర్కొంది. ఇప్పటికైనా ఇండియా వ్యాక్సిన్ సరఫరాను పెంచాలని, కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్(Vaccine) అందించాలని తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరం గురించి ప్రస్తావించింది.

Also read: తప్పిన China Rocket ముప్పు, హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్ Long March 5B శకలాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News