Corona Second Wave: ఇండియాకు సహాయమందించేందుకు ముందుకొచ్చిన అగ్రరాజ్యం అమెరికా

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ప్రకోపంతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యపరంగా అవసరమైన అదనపు సహాయాన్ని అందించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 25, 2021, 05:24 PM IST
  Corona Second Wave: ఇండియాకు సహాయమందించేందుకు ముందుకొచ్చిన అగ్రరాజ్యం అమెరికా

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ప్రకోపంతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యపరంగా అవసరమైన అదనపు సహాయాన్ని అందించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.

కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తయారీకు అవసరమయ్యే ముడి పదార్ధాల్ని (Raw Material Export ) ఇండియాకు ఎగుమతి చేయడంపై అగ్రరాజ్యం నిషేధం విధించడమే కాకుండా తాజాగా ఆ నిషేధాన్ని సమర్ధించుకుంది. అమెరికా ప్రజల బాథ్యతల్ని పట్టించుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించుకుంది. కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) తాకిడికి తల్లడిల్లుతున్న ఇండియా పరిస్థితులపై అన్నివైపుల్నించీ అమెరికాపై ఒత్తిడి పెరిగింది. చివరి జో బిడెన్ ప్రభుత్వం ( Joe Biden) ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒత్తిళ్లకు తలొగ్గి..ఇండియాకు సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. కరోనా పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ఇండియాకు అవసరమైన వైద్యపరమైన సహాయాన్ని అందించనున్నామని అమెరికా  విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ( Antony Blinken) ట్వీట్ ద్వారా వెల్లడించారు. 

ప్రస్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో భారత్‌కు సాయం చేయాలంటూ యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తో ( Us Chamber of Commerce) పాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు, ప్ర‌ముఖ ఇండియ‌న్‌-అమెరిక‌న్‌లు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ ( AstraZeneca Vaccines) తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను ఇండియాకు స‌ర‌ఫ‌రా చేయాల‌ని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden) ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కూడా భారత్‌కు సహాయం అందించే విషయమై సానుకూలంగా మాట్లాడారు. అన్నివైపుల్నించి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలో తీసుకున్న అగ్రరాజ్యం భారత్‌కు సహాయం అందించడానికి ( America to help india) ముందుకు వచ్చింది. కోవిడ్ మ‌హ‌మ్మారితో స‌త‌మ‌వుతున్న భారత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాం. భార‌త ప్ర‌భుత్వంలో ఉన్న మా భాగ‌స్వాముల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాం. ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు సాయాన్ని శ‌ర‌వేగంగా అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ట్వీట్ చేశారు. 

Also read: Greta Thunberg: ఇండియాకు తక్షణం ప్రపంచదేశాలు సహాయం అందించాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News