BSNL Offering Double Data : ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.
వినియోగదారులకు డేటా అవసరాలు తీర్చేందుకు రీఛార్జ్ ప్లాన్ ధర పెంచకుండా డబుల్ డేటా ప్రకటించింది బీఎస్ఎన్ఎల్. కేవలం రూ.109తో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లకు డబుల్ డేటా అందిస్తోంది. మరో విశేషం ఏంటంటే ఇదివరకు 5 జీబీ డేటాను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇకనుంచి 10 జీబీ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. అయితే మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Also Read: Recharge Plans: ఎయిర్‌టెల్, Jio మరియు Vi అందిస్తున్న బెస్ట్ డేటా, కాలింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
సాధారణంగా బీఎస్ఎన్ఎల్ రూ.109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 20 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రత్యేకమైన ఆఫర్‌లో భాగంగా వ్యాలిడిటీని 75 రోజులకు పెంచుతూనే డేటాను డబుల్ చేయడం విశేషం. మార్చి 31లోగా రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Also Read: Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్
కాగా, తన వినియోగదారుల కోసం రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్‌ను సవరించింది. గతంలో ఈ ప్లాన్‌పై కేవలం 300 నిమిషాల వాయిస్ కాల్స్ అందిస్తుండగా, ప్రస్తుతం అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ప్రతిరోజూ 100 వరకు SMSలు పంపించవచ్చు.
Also Read: BSNL Offers: ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా BSNL Cinema Plus సర్వీస్, ఇక సినిమాలే సినిమాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook