Heavy Rain In Delhi - Visuals | న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో ఇప్పటికే తీవ్రమైన చలి, చలిగాలులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 1.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదై 15 ఏళ్ల రికార్డును తిరగరాసింది. ఇప్పటికే చలితో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రజలకు వర్షం (Heavy Rain In Delhi) కూడా వణికిస్తోంది.
Delhi: The national capital wakes up to a rainy morning; visuals from Green Park (pic 1&2) and Chandni Chowk (pic 3&4) areas. pic.twitter.com/O5suBOi83y
— ANI (@ANI) January 3, 2021
ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ (Delhi-NCR) తోపాటు సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. Also Read: Lowest temperature: ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత..వణికిస్తున్న చలిగాలులు
#WATCH I Delhi: Rain lashes parts of the national capital; visuals from near Barakhamba Road pic.twitter.com/hMjERKdvCX
— ANI (@ANI) January 3, 2021
ఈ మేరకు వాతవరణ శాఖ ప్రకటనను విడుదల చేసింది. ఢిల్లీ (Delhi) లోని కొన్ని ప్రాంతాలతోపాటు, హర్యానా (Haryana) లోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. పశ్చిమ అవాంతరాల ప్రభావం కారణంగా వచ్చే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదైంది. Also Read: Punjab సీఎంను చంపుతామంటూ పోస్టర్.. కేసు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook