Coronavirus in AP: అమరావతి: ఏపీలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 20,590 శాంపిల్స్ పరీక్షించగా.. 1,775 మందికి కరోనావైరస్ ( COVID-19 ) సోకినట్టు తేలింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో మొత్తం 17 మంది కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపూర్, కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో కరోనా మృతులు ఉన్న జిల్లాల విషయానికొస్తే.. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 97 మంది కరోనాతో మృతి చెందగా ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 77 మంది కరోనాతో చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు ఏపీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 309కి చేరింది ( COVID-19 deaths ). ( Also read: COVID-19 vaccine: కోవిడ్-19 వ్యాక్సిన్‌పై స్పష్టత వచ్చేసింది )
ఏపీలో ఇప్పటివరకు మొత్తం 11,36,225 శాంపిల్స్ పరీక్షించగా.. 24,422 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది. గత 24 గంటల్లో 1,168 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,399కి చేరింది. ప్రస్తుతం 12,533 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. కరోనావైరస్ పరీక్షల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్న సంగతి తెలిసిందే. ( Also read: Remdesivir: ఆ మందుతో మరణాల రేటు తగ్గుతోందట )