తిరుపతి బస్ టిక్కెట్లు.. ఇక రైళ్ళల్లో లభ్యం

ఆర్టీసి కండక్టర్లు తిరుపతి ముందు  స్టేషన్‌లో రైలు ఆగగానే ఎక్కి ప్రయాణికులకు ఈ టికెట్లను అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. 

Last Updated : Nov 26, 2017, 04:07 PM IST
తిరుపతి బస్ టిక్కెట్లు.. ఇక రైళ్ళల్లో లభ్యం

తిరుమలేశుడి దర్శనానికి రైళ్లో ప్రయాణించే ప్రయాణికులు.. స్టేషన్‌లో దిగాక ఆర్టీసి బస్సు ఎక్కి నేరుగా తిరుపతి కొండపైకి వెళ్లేందుకు.. ఇక నుండే రైళ్ళలో కూడా బస్ టిక్కెట్లు విక్రయించనున్నారు. తొలిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ బస్ టిక్కెట్ల ప్రాజెక్టు మొదటి విడత సర్వీసులు నారాయణాద్రి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అందిస్తున్నారు. అలాగే తమిళనాడు, కర్ణాటక నుండి తిరుపతికి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ సౌలభ్యాన్ని కల్పించనున్నారు.

ఈ మధ్యకాలంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసి కండక్టర్లు తిరుపతి ముందు  స్టేషన్‌లో రైలు ఆగగానే ఎక్కి ప్రయాణికులకు ఈ టికెట్లను అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఆర్టీసి శాఖ, రైల్వే శాఖతో తాత్కాలికంగా ఏర్పరచుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన అధికారులు.. మరిన్ని రైల్వే స్టేషన్లలో కూడా ఈ బస్ టికెట్ల విక్రయాన్ని చేపట్టే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 

Trending News