Jagadish Reddy: 'నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గుండాల రాజ్యం.. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే భయం'

Jagadish Reddy Hot Comments Congress Goon Rule Not Accept: నల్లగొండ జిల్లా రాజకీయాలు తెలంగాణను ఊపేస్తున్నాయి. కాంగ్రెస్‌ గూండాగురి చేస్తుండడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 21, 2025, 06:58 PM IST
Jagadish Reddy: 'నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గుండాల రాజ్యం.. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే భయం'

Jagadish Reddy: తెలంగాణలో నల్లగొండ రాజకీయం రంజుగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాకు అనుమతి నిరాకరణ, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నాయకుల దాడితో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈ వ్యవహారం తీవ్ర వివాదం రేపగా.. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ గూండా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Also Read: BRS Party MLAs: రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ మాస్టర్‌ స్ట్రోక్‌.. హైదరాబాద్‌లో కాక రేపిన ఎమ్మెల్యేల భేటీ

నల్లగొండలో బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్ట్‌పై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. 'నల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కేటీఆర్ భయం పట్టుకుంది. కేటీఆర్ ఫొటో చూసినా.. గులాబీ రంగు చూసినా వెంకట్ రెడ్డికి భయమైతుంది' అని తెలిపారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చించేశారని చెప్పారు.

Also Read: Retirement Age: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌.. పదవీ విరమణ వయస్సు తగ్గించాలని జేఏసీ ఆందోళన

'వెంకట్ రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేస్తున్నారు. వెంకట్ రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు జాగ్రత్తగా మీకు ఇబ్బందులు తప్పవు' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి హెచ్చరించారు. చట్టప్రకారం పనిచేయాలని అధికార యంత్రాంగానికి హితవు పలికారు. 'అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను విడుదల చేయాలి' అని డిమాండ్‌ చేశారు.

'పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదు' అని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణాలో వచ్చిన తిరుగుబాటు వెంకట్ రెడ్డి వారి వలనే వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి స్వయంగా ఫోన్ చేసి తమ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడని ఆరోపించారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని నిలదీశారు. చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవని స్పష్టం చేశారు.

'కాంగ్రెస్ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా భయపడుతుంది. కాంగ్రెస్ పాపాల పుట్ట పలుగుతుంది. కాంగ్రెస్ రహిత తెలంగాణా కోసం నల్లగొండ నుంచే ఉద్యమం మొదలవుతుంది' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ హఠావో తెలంగాణా బచావో నినాదం మొదలైంది గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News