Redmi Note 3 Pro: 200 మెగాపిక్సెల్ కెమేరా రెడ్‌మి నోట్ 13 ప్రోపై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

Redmi Note 3 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నోట్ 13 ప్రో ఇష్టపడేవారికి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 21, 2025, 02:36 PM IST
Redmi Note 3 Pro: 200 మెగాపిక్సెల్ కెమేరా రెడ్‌మి నోట్ 13 ప్రోపై భారీ డిస్కౌంట్, ధర ఎంతంటే

Redmi Note 3 Pro: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రిపబ్లిక్ డే ఆఫర్లు నడుస్తున్నాయి. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై కూడా భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో భాగంగానే రెడ్ మి నోట్ 13 ప్రో ఫోన్ పై ఏకంగా 31 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

రెడ్ మినోట్ 13 ప్రో అనేది 6.67 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1800 నిట్స్ బ్రైట్‌నెస్, 1220/2712 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. స్క్రీన్ సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటుంది.ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 2 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 13 తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ఉపయోగించి స్టోరేజ్ ఇంకా పెంచుకోవచ్చు. ఇక కెమేరా అయితే తిరుగులేదనే చెప్పాలి. రెడ్ మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ కెమేరా ఉంటాయి. వీటన్నింటికంటే మించి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది. 

రెడ్ మి నోట్ 13 ప్రో ఫోన్ 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది యాంటీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు సంబంధించి ఐపీ 54 రేటింగ్ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

ఇక ధర విషయానికొస్తే 31 శాతం డిస్కౌంట్ అనంతరం రెడ్ మి నోట్ 13 ప్రో ఫోన్ కేవలం 19,699 రూపాయలుక పొందవచ్చు. ఏదైనా బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 

Also read: TG DSC 2025 Notification: నిరుద్యోగులకు శుభవార్త, త్వరలో 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News