Trump Vs Modi: ఎట్టకేలకు అమెరికాకు రెండోసారి అది కూడా నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చొన్న రిపబ్లికన్ వ్యక్తిగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. ముందు నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచారు ట్రంప్. అంతేకాదు అమెరికన్ డీప్ స్టేట్ అంతు చూస్తానని ప్రకటనలు చేసారు.తాజాగా ఎట్టకేలకు వైట్ హౌస్ లో అభిమానుల సమక్షంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడంతో H1B వీసా హోల్డర్లలో మరింత టెన్షన్ పెరిగింది. ఎందుకంటే.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనూ.. గెలిచిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్న వలసదారులపై ప్రతికూల ప్రకటనలు చేయడంతో పాటు, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మార్పుల చేస్తామనడం ఇందుకు కారణం.
చాలామంది భారతీయులు అమెరికాలో చదువుకోవాలి.. స్థిరపడాలి అని కోరుకుంటారు. అలాంటి వారికి అమెరికా H1B వీసాలను జారీ చేస్తుంది. ప్రపంచ దేశాలకు అమెరికా జారీ చేసే H1B వీసాల్లో దాదాపు 72 శాతం భారతీయుడు వినియోగించుకుంటున్నారని అమెరికన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ రాకతో.. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో.....H1B వీసా హోల్డర్లకు, ఇకముందు వీసా పొందాలనుకునే భారతీయులకు కొంత ఇబ్బంది కలిగి అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
H1B వీసా.. నైపుణ్యం కలిగిని విదేశీ పౌరులకు అమెరికా జారీ చేసే తాత్కాలిక వీసా ఇది. H1B వీసా పొంది అమెరికాకు వెళ్లిన వారానికి అక్కడ ఉండేందుకు 6 యేళ్ల వ్యవధి ఉంటుంది.. ఇందులో మొదట మూడేళ్లు... ఆ తర్వాత పొడిగింపుగా మరో మూడు సంవత్సరాలు అక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అమెరికా జారీ చేసే 72శాతం H-1B వీసాలను భారతీయులు కలిగి ఉన్నారు. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపుతారు.
వలసదారులుగా భారతీయులు మెక్సికోలో అత్యధికంగా ఉన్నారు. తర్వాత అమెరికాలో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత H1B వీసాల విషయంలో మరిన్ని మార్పులు, వీసాల తగ్గింపు వంటి హామీలు ఇవ్వడంతో భయపడుతున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పాలనపై తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ట్రంప్ కొన్నింటిపై సంతకాలు చేసారు. మరికొన్నింటిపై చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా ఏడు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, వలసదారుల డిపోర్టేషన్, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, క్షమాభిక్షలు వంటి కార్యక్రమాలను తొలి రోజే నుంచే ప్రారంభించనున్నారు.
ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో కూడా అంబానీ దంపతులు పాల్గొనున్నారు. అంబానీ కుటుంబానికి ట్రంప్ కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు కూడా హాజరయ్యారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.