Rains Alert: రానున్న రెండ్రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం ఉండనుంది. తెలంగాణలో పొడి వాతావరణం ఉంటే ఏపీలో అందుకు భిన్నంగా మోస్తరు వర్షసూచన జారీ అయింది. వచ్చే రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉండనుందని ఐఎండీ వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా రానున్న రెండ్రోజులు ఏపీలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఈ మధ్యకాలంలో వరుస అల్పపీడనాలు, తుపానులతో ఏపీలో తరచూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరోసారి మోస్తరు వర్షసూచన జారీ అయింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో ఇవాళ, రేపు వాతావరణం పూర్తిగా పొడిగా ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన జారీ కాలేదు. కానీ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. రేపు మాత్రం వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక తెలంగాణలో రానున్న 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం వేళ పొగమంచు గట్టిగా ఉంటుంది. ఈ మూడు రోజులు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ ఉండవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వర్షసూచన లేదు. హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉపరితలంలో గాలులు తూర్పు ఆగ్నేయ దిశలో గంటకు 4-8 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. కొద్దిరోజులుగా తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షిణ తెలంగాణలో చలితీవ్రత కాస్త ఎక్కువగా ఉండవచ్చు.
Also read: 8th Pay Commission: గత పే కమిషన్‌లకు.. 8వ వేతన సంఘంలో మార్పులు ఇవే? మీకు లబ్ధి ఏమిటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.