Central home ministry serious on ttd controversy issues: తిరుమల ఇటీవల వరుస వివాదాలకు కేరాఫ్ గా మారింది. లడ్డు వివాదం ఎప్పుడు బైటపడిందో అప్పటి నుంచి తిరుమల అంశం ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కారు తిరుమలపై ప్రత్యేకంగా శ్రద్ద కనబర్చారు. స్వామివారి కైంకర్యాలలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు సైతం.. సామాన్య ప్రజలకు శ్రీవారి దర్శనం ఫస్ట్ ప్రయారిటీగా కల్పించాలన్నారు. అంతే కాకుండా.. తిరుమలలో ఎక్కడకూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకొవాలన్నారు. ఇటీవల కూటమి సర్కారు తిరుమలలో కొత్తగా టీటీడీ పాలక మండలిని సైతం ఏర్పాటు చేసింది. దీనికి బీఆర్ నాయుడును చైర్మన్ గా ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా తిరుమలలో ఇటీవల అనేక వివాదాలు చుట్టుముట్టాయని చెప్పుకొవచ్చు .
రాజకీయ నేతలు పవిత్రమైన తిరుమల మాడ వీధుల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. కొందరు స్వామి ఆలయ పరిసరాల్లో రీల్స్, ఫోటో షూట్ లు తీసుకుంటున్నారు. అంతే కాకుండా.. తిరుమలలో ఇటీవల పరాకామణిలో చోరీల ఘటన, రూ. 300 ల నకిలీ టికెట్లు స్కామ్ వరుసగా జరిగాయి.
ఇవి చాలదన్నట్లు.. తిరుమలలో అన్యమత ప్రచారంకు చెందిన వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో జరిగిన ఘటన యావత్ దేశాన్ని షాకింగ్ కు గురిచేసింది. దీనిలో..6 గురు చనిపోగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై కేంద్రం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
ఇటీవల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం తీవ్ర భయాందోళనకలు గురిచేసింది. తాజాగా.. తిరుమలో కొండపైకి..గుడ్డుపలావ్ లో లభించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో .. కడప చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల కుమారుడు సాత్విక్ శ్రీనివాసరాజు(3) ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు పైనుంచి పడిపోయాడు. ఈ క్రమంలో ఈ వరుసగా జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నివేదిక ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది.
అదే విధంగా.. క్షేత్రస్థాయి పరిశీలనకు హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ ని పంపుతున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో తిరుమలకు సంజీవ్ కుమార్ జిందాల్ రానుండంతో.. టీటీడీ అధికారుల్లో టెన్షన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తొంది. టీటీడీచరిత్రలో ఇలాంటి ఘటనలపై మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter