Manchu Manoj Press Meet: తమ కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తి వివాదం కాదని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. తన తండ్రి మంచు మోహన్ బాబును వెనుక ఉండి మంచు విష్ణు నడిపిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. విష్ణు కారణంగానే గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. 'నేను తాగొచ్చి వచ్చి కొడుతున్నా' అని చెబుతున్నట్లు మండిపడ్డారు. కుటుంబసభ్యులం అందరం మాట్లాడుకుందామని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Manchu Family: 'నేను ముసలోడిని.. ఇల్లు ఖాళీ చేయించాలి' అని కలెక్టర్‌కు మోహన్ బాబు విజ్ఞప్తి
జల్పల్లిలోని మంచు మనోజ్ నివసిస్తున్న భవనాన్ని ఖాళీ చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో కలెక్టర్ నోటీసు ఇవ్వడంతో కలెక్టర్ కార్యాలయానికి సినీ నటుడు మంచు మనోజ్ చేరుకుని వివరణ ఇచ్చాడు. అదనపు కలెక్టర్‌ను కలిసి తన వాదన వినిపించినట్లు చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంలో వారంతా అబద్ధాలు చెబుతూ దొరికిపోతున్నారని తెలిపాడు.
Also Read: Laila Teaser: 'తెల్లగా సేసుడే కాదు.. తోలు తీసుడు వచ్చు'.. మాస్ కా దాస్ 'లైలా' టీజర్ విడుదల
'మా అన్న (మంచు విష్ణు) కారణంగానే తగాదాలు జరుగుతున్నవి. ఆస్తిపై మా కుటుంబసభ్యులందరికి హక్కు ఉంటుంది. విచారణ కోసం ఇక్కడికి వచ్చాను. నా న్యాయపోరాటం కొనసాగుతుంది' అని మంచు మనోజ్ స్పష్టం చేశాడు. 'కుటుంబసభ్యులందరం కూర్చొని మాట్లాడుకుందామని రమ్మని ఎన్నోసార్లు పిలిచినా.. రావాలని చెప్పినా ఎవరూ రావడం లేదు' అని వివరించాడు. 'జల్పల్లిలో తన పాప ఇంట్లో ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరిగాయి. ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటానికి కొనసాగిస్తా' అని మంచు మనోజ్ ప్రకటించాడు.
"ఢిల్లీ.. హైదరాబాద్ ఎక్కడకు వెళ్లినా కూడా తన పోరాటం కొనసాగుతుంది. చంద్ర మండలానికి కూడా వెళ్లనివ్వండి. కానీ నా పోరాటం కొనసాగుతుంది' అని మనోజ్ తెలిపాడు. తిరుపతిలో విద్యాసంస్థ ముందు గొడవకు కారణం వాళ్లే అని చెప్పాడు. ఇష్టారీతిన కొన్ని వీడియోల, సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి ఎలా సినిమా తీస్తున్నారని 'భక్త కన్నప్ప' సినిమాపై మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. 'ఇది కూర్చొని మాట్లాడుదామని చెప్పినా పట్టించుకోవడం లేదు. నేను పారిపోవడం. సిగ్గుతో పారిపోవడం లేదు. నేను భయపడడం లేదు. నేను ఎక్కడికి పిలిచినా వెళ్లి మాట్లాడుతా' అని మంచు మనోజ్ వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.