Chandrababu Davos Tour: ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్‌లో పర్యటనకు వెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శనివారం రాత్రి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నారు. దావోస్ వెళ్లే బృందంలో సీఎంతో పాటు మరో ఎనిమిది మందికి అవకాశం లభించింది.
ప్రభుత్వ అధికారులు, మంత్రులు మాత్రమే బృందంలో సభ్యులుగా ఉండాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ ప్రకారం మంత్రులు లోకేశ్, టీజీ భరత్, సీనియర్ అధికారులు దావోస్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏంటి? ఇక్కడి అదనపు సదుపాయాలు ఏమిటి? రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన పారిశ్రామిక పాలసీలో ప్రత్యేకతలు వంటి అంశాలను వివరించడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టి అట్రాక్ట్ చేసేందుకు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచదేశాల ఆర్థిక సదస్సులో ఐదు సెషన్లలో ప్రధాన వక్తగా మాట్లాడే అవకాశం భారత్ కు దక్కింది. అయితే వాటిలో సీఎం చంద్రబాబు మూడు సెషన్లు.. మంత్రి లోకేశ్ రెండు సెషన్లలో మాట్లాడనున్నారు. అందుకు అనుగుణంగా వారి పేర్లతో ‘వైట్‌పాస్’లు డబ్ల్యూఈఎఫ్ నుంచి అందాయి. ఆహ్వానితులకే సమావేశాల్లో పాల్గొనడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్‌తో పాటు.. ఐటీ, పలు కీలకరంగాల్లో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేందుకు దావోస్‌ను వేదికగా చేసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల గురించి వివరించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి గరిష్ఠ పెట్టుబడుల ప్రయోజనాన్ని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.