Winter Face Mask For Glowing Skin: చలికాలంలో కాఫీ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం చంద్రబింబంలో మెరుస్తుంది. ఎందుకంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇవి చర్మానికి పునరుజ్జీవనం అందిస్తాయి. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తుంది. దీంతో మీ ముఖం ప్రకాశంవంతంగా కనిపిస్తుంది. కాఫీతో పాటు తేనె వేసుకోవడం వల్ల రెండిటి కలయికతో అద్భుతమైన పేస్ మాస్క్ తయారవుతుంది. దీంతో మీరు మచ్చలేని కాంతివంతమైన స్కిన్ పొందుతారు.
కాఫీ తో ఫేస్ మాస్క్ తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం..
కాఫీ ఒక టేబుల్ స్పూన్, తేనే ఒక టేబుల్ స్పూన్, శనగపిండి ఒక టేబుల్ స్పూన్
ఈ మూడిటిని ఒక బౌల్ లోకి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గడ్డలు కట్టకుండా స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. దీంతో మీ ఫేస్ మాస్కు రెడీ అవుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖం మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. ఓ 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత ఫేస్ గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.. మొదట స్క్రబ్ మాదిరి సర్క్యూలర్ మోషన్ లో రుద్దాలి. దీంతో మీ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫేస్ మాస్కుని వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. చలికాలంలో చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. ఎందుకంటే ఈ ఫేస్ మాస్క్‌లో ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తేనే ముఖానికి మాయిశ్చర్ అందిస్తుంది.. శనగపిండి చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇక కాఫీ ముఖాన్ని ప్రకాశంవంతంగా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫేస్ మాస్కు ఒకటి ఉపయోగించినా చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు మీ ముఖం పొడిబారకుండా వెలిగిపోతుంది.
ఇదీ చదవండి: వైభవంగా భోగి సంబురాలు.. మంచుఫ్యామిలీ, రోజా కుటుంబం ఫోటోలు వైరల్..
చలికాలంలో ముఖానికి స్క్రబ్ చేసుకో తయారు చేసుకోవడం వల్ల ముఖం వెలిగిపోతుంది. కాఫీతో స్క్రప్ చేసుకోవాలి. ఈ ఫేస్ స్క్రబ్ తయారు చేసుకోవడానికి కాఫీ పొడి తీసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసిన షుగర్ పొడి కూడా వేసుకొని తేనె కలపాలి.. ఆ తర్వాత దీన్ని సర్క్యూలర్ మోషన్ లో ముఖంపై స్క్రబ్ చేసుకోవాలి. దీంతో ముఖంపై ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి. ట్యాన్ తొలగిపోతుంది. ఈ ప్యాక్ తరచూ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, గీతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఇదీ చదవండి: కనుల పండువగా కుంభమేళా ప్రారంభం.. కేవలం రూ.1296 కే హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవచ్చు..
చలికాలంలో చర్మ సమస్యలు రాకుండా ఉండటానికి ప్రత్యేకంగా శనగపిండితో కూడా ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు. శనగపిండి కొద్దిగా పసుపు, పాలు వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇంకా చిట్టి చర్మంతో బాధపడుతున్న వారు పాలకు బదులుగా రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ను కూడా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. దీంతో పార్లర్ కు వెళ్లకుండానే మీ స్కిన్ పొందుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.