Emergency Movie: ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షో.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు

Emergency Movie Special Show: కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన మూవీ ఎమర్జెన్సీ. జనవరి 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుండగా.. నాగ్‌పూర్‌లో స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మూవీని వీక్షించి.. ప్రశంసలు కురిపించారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Jan 12, 2025, 07:32 AM IST
Emergency Movie: ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షో.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు

Emergency Movie Special Show: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా.. బాలీవుడ్‌ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. అనుపమ్‌ ఖేర్‌, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించగా.. ఎన్నో వివాదాలు, వాయిదాల తరువాత ఆడియన్స్ ముందకు రానుంది. గతేడాది సెప్టెంబర్‌లోనే థియేటర్స్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా అనంతరం జనవరి 17న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ మూవీ స్పెషల్ షోను ప్రదర్శించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్‌తోపాటు ఎమర్జెన్సీ టైమ్‌లో  జైలు శిక్ష అనుభవించిన అప్పటి కార్మికులను సినిమాను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

సినిమా చూసిన అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. తాను సినిమా మొదటిసారి చూస్తున్నానని చెప్పారు. ఎమర్జెన్సీ టైమ్‌ కష్టాలు ఎదుర్కొన్న కొంతమందిని తాము పిలిచామన్నారు. ఎమర్జెన్సీ మూవీ ద్వారా కంగాన అసల చరిత్రను చూపించారని తెలిపారు. ఈ సినిమా చిరస్థాయిలో నిలిచిపోతుందని నమ్మకం ఉందన్నారు. ఎమర్జెన్సీ హిస్టరీ మరోసారి భవిష్యత్ తరం కోసం ముందుకు వస్తుందన్నారు. మన దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని ఇంత ప్రామాణికతతో అందించినందుకు చిత్రనిర్మాతలు, నటీనటులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పార. ఈ చిత్రాన్ని తప్పకుడా చూడాలని కోరారు. 

కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "మా సినిమా మొదటి ప్రదర్శన ఇది. నితిన్ జీ కుటుంబ సభ్యుడిలా కనిపిస్తున్నారు. ఒక రకమైన అనుబంధం ఉంది. నేను సినిమాను చూడాలని కోరితే ఆయన వచ్చారు. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా.. ఆ అడ్డంకిని దాటేందుకు ఆయననే సహాయం కోరతాను. ఎమర్జెన్సీ టైమ్‌లో పరిస్థితిపై సినిమా తీశాం. ఈ సినిమాపై ఇప్పటికే చాలా నిషేధాలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ చాలా పరిశీలన చేసింది. చరిత్రకారులను నియమించి.. ప్రతి సంభాషణను పరిశీలించారు. మేము ఆధారాలు ఇవ్వాల్సి వచ్చింది. 6 నెలల పోరాటం తర్వాత థియేటర్స్‌లోకి వస్తోంది.." అని తెలిపారు.

జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, రేణు పిట్టి సంయుక్తంగా ఈ చిత్రానికి ఫైనాన్స్ చేశాయి. సంచిత్ బల్హరా, జీవీ ప్రకాష్‌ కుమార్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను రితేష్ షా రాశారు. ఈ చిత్రానికి రామేశ్వర్ ఎస్.భగత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. టెట్సూ నాగత కెమెరా వర్క్‌ను చూసుకున్నారు.

Also Read: Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. 'నీకు గుడి కట్టాలి సామీ'  

Also Read: Liquor: మందుబాబులకు బంపర్‌ వార్త.. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News