yoga boosts sperm quality : 'యోగా'తో సంతాన యోగం

ఆధునిక యుగంలో వేగం పెరిగింది. ప్రతి పనికీ ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఉద్యోగం చేసే వారైనా. .  వ్యాపారం చేసే వారైనా. .  తమ పని కోసం కాలంతోపాటు పరుగు పెడుతున్నారు. ఒక్కోసారి రోజుకు 24 గంటలు కూడా సరిపోవేమో అనే పరిస్థితి వస్తోంది.

Last Updated : Mar 11, 2020, 10:34 AM IST
yoga boosts sperm quality : 'యోగా'తో సంతాన యోగం

ఆధునిక యుగంలో వేగం పెరిగింది. ప్రతి పనికీ ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఉద్యోగం చేసే వారైనా. .  వ్యాపారం చేసే వారైనా. .  తమ పని కోసం కాలంతోపాటు పరుగు పెడుతున్నారు. ఒక్కోసారి రోజుకు 24 గంటలు కూడా సరిపోవేమో అనే పరిస్థితి వస్తోంది.  ఈ క్రమంలో సమాజంలో పురుషులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. పని ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఫలితంగా వారిలో సంతాన లేమి లేదా వ్యంధ్యత్వానికి దారి తీస్తోంది. 
 

పురుషుల్లో పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా సంతానం కలగడం లేదు. దీంతో దంపతులు సంతానం కోసం మళ్లీ మందులు వాడడం, నమ్మకం ఉన్న వారు పూజలు చేయడం చూస్తున్నాం. ఐతే సంతానలేమి కారణంగా వారి మానసిక స్థితిపైనా ప్రభావం పడుతోంది. నిజానికి ప్రశాంతంగా ఉన్నప్పుడే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఐతే ఇలాంటి పురుషుల కోసం హైదరాబాద్ లోని ... సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్  మాలిక్యూల్ బయాలొజి .. .CCMB, ఢిల్లీలోని AIIMS సంయుక్తంగా ఓ శుభవార్త అందించాయి.

Read Also: దిగొచ్చిన పెట్రో ధరలు

సంప్రదాయ యోగా పద్ధతులను అవలంభించడం వల్ల పురుషుల్లో వీర్యకణాలు వృద్ధి చెందుతాయని ఈ రెండు పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ఫలితంగా సంతానోత్పత్తికి మార్గం సులభమవుతుందని తెలిపాయి. వ్యంధ్యత్వం ఉన్న పురుషులను 21 రోజుల పాటు యోగా చేయించి..  పరిశీలించి వారిలో జరుగుతున్న మార్పులను ఈ రెండు పరిశోధనా సంస్థలు గమనించాయి. ఓ నివేదికను రూపొందించాయి. యోగా, ధ్యానంతో వీర్య కణాల కదలిక కూడా పెరుగుతుందని పేర్కొన్నాయి. యోగా, ధ్యానంతోపాటు సమతుల పోషకాలు  ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read Also: కార్తికేయ 2 కాన్సెప్ట్ వీడియో ఇదిగో.. !!

Trending News