అలనాటి హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ గుర్తున్నారా..!! జురాసిక్ పార్క్ సిరీస్ సినిమాలతో సంచలనం సృష్టించిన హాలీవుడ్ డైరెక్టర్ ఆయన. ప్రస్తుతం ఆయన.. తన కూతురు కారణంగా వార్తల్లో నిలిచారు.
ఆయన మికాయిలా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం 23 ఏళ్లు ఉన్న ఆ అమ్మాయి .. పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే అడల్ట్ వీడియోలు చేస్తూ .. కెరీర్ సాగిస్తోంది. తాజాగా తాను పోర్న్ స్టార్ గా మారేందుకు నిర్ణయించుకున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపింది. ఐతే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు కూడా సమర్ధించారని చెప్పింది. తన స్టేజ్ నేమ్‌ను ఆమె షుగర్ స్టార్‌గా పెట్టుకుంది.
మరోవైపు మికాయిలా నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. మికాయిలా నిర్ణయాన్ని స్టీవెన్ స్పీల్బర్గ్ సమర్ధించడంలో తనకు కొత్త ఏమీ అనిపించడం లేదని ట్వీట్ చేశారు. THE WORLD IS REALLY EVOLVING!!! అని ట్వీట్ ముగించారు. గతంలో 'మేరా బేటీ సన్నీ లియోన్ బన్నా చాహతీ హై' పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు.
Nothing could have endorsed PORN more than STEVEN SPIELBERG’S own daughter MIKAELA becoming a PORN STAR and SPIELBERG himself supporting his DAUGHTER’S decision..THE WORLD IS REALLY EVOLVING!!! https://t.co/eo5uQgb8W2 pic.twitter.com/2zv54r3yAI
— Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2020
పోర్న్ స్టార్‌గా స్టీవెన్ స్పీల్బర్గ్ కూతురు