Megastar fires on mohanbabu: మోహన్ బాబు ఇంటి గొడవలు ప్రస్తుతం టాలీవుడ్ లో రచ్చగా మారినట్లు తెలుస్తొంది. ఇది ఒకవైపు రాజకీయంగాను, మరొవైపు ఇండస్ట్రీలో కూడాహాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు తన కొడుకుపై ఫిర్యాదు చేయడం, మరొవైపు మనోజ్ .. తనకు జస్టిస్ కల్గే విధంగా చూడాలని రెండు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, డీజీపీలకు కూడా ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిన్న (మంగళవారం) రాత్రి జల్ పల్లిలోని మోహన్ నివాసం దగ్గర అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కంట్రోల్ తప్పడం, ఆయన రిపోర్టర్ మీద దాడిచేయడం జరిగింది. జర్నలిస్ట్ సంఘాలు, తెలంగాణ సర్కారు దీన్ని ఖండించాయి. పొంగులేటీ కూడా దీనిపై రియాక్ట్ అయినట్లు తెలుస్తొంది.
అయితే.. పోలీసులు మంచు మోహన్ నుంచి గన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీపీ తమ ఎదుట హజరు కావాలని నోటీసులు ఇవ్వగా.. మోహన్ బాబు.. కోర్టుకు వెళ్లి హజరు నుంచి మినహయింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం.. మంచు మోహన్.. ప్రవర్తన తొలుత నుంచి కాంట్రవర్షీలకు కేరాఫ్ అని కొందరు చెబుతుంటారు.
గతంలో ఆయన చిరంజీవికి ప్రదానం చేసిన లెజండరీ అవార్డు విషయంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరమీదకు వచ్చి రచ్చగా మారినట్లు తెలుస్తొంది. గతంలో వజ్రోత్సవాల సమయంలో లెజెండరీ అవార్డుల ప్రధానోత్సవం సమయంలో.. మోహన్ బాబు మాట్లాడిన మాటలు మరల తెరమీదకు వచ్చినట్లు తెలుస్తొంది.
గతంలో మోహన్ బాబు.. వజ్రోత్సవాల నేపథ్యంలో.. లెజండరీ అవార్డును చిరంజీవితో పాటు.. మరికొందరికి ప్రదానం చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఆ సమయంలో.. మోహన్ బాబు ఒక రకమైన అసహానంతో స్టేజీ మీద మాట్లాడిరంట. అదే విధంగా..లెజండరీ అంటే ఏంటీ.. సెలబ్రీటీ అంటే.. ఏంటని నిర్వాహకుల్ని స్టేజీమీదనే ప్రశ్నించినట్లు తెలుస్తొంది.
తాను.. ఒక విశ్వవిద్యాలయం నడిపిస్తున్నానని.. కులమతాలకు అతీతంగా రిజర్వేషన్ లు ఇస్తున్నానని, 550 కిపైగా చిత్రాలలో నటించారని.. 40 కిపైగా సినిమాలు తీసినట్లు చెప్పారు. రాజకీయాల్లో కూడా రాణించినట్లు చెప్పారు. దీనికన్న లెజండరీ ఇంకేముంటుందని .. చిరంజీవిని గురించి ఇన్ డైరెక్ట్ గా వెటకారంగా మాట్లాడినట్లు అప్పట్లో ట్రోల్స్ జరిగాయి. అదే విధంగా చిరు ఇంటి విషయాల గురించి కూడా చులకనగా చేసి మాట్లాడినట్లు అప్పట్లోప్రచారం జరిగింది.
Read more: Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..
అయితే.. ఆ తర్వాత చిరు ఆ కార్యక్రమంలో.. లెజెండరీ అవార్డు తీసుకొకుండా క్యాప్సుల్ బాక్స్ లో ఉంచినట్లు తెలుస్తొంది. తాజాగా.. చిరుకు.. ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు మాట్లాడుతూ.. ఇది తనకు నిజమైన అవార్డు అంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, మెగా ఫ్యాన్స్ మాత్రం.. ఆరోజు చిరును అవమాన పర్చే విధంగా మాట్లాడావ్.. ఈరోజు అనుభవిస్తున్నావ్.. కర్మ వదలొద్దు.. ఆలస్యమైన కూడా.. వడ్డీతో సహా ఇచ్చేస్తుందంటూ కొంత మంది మెగా ఫాన్స్ మాత్రం మంచు మోహన్ ను సోషల్ మీడియలో తెగ ట్రోల్స్ చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.