Manchu Manoj vs Mohan Babu:
హీరో మంచు మనోజ్ ఈరోజు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడం.. తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కాలికి గాయం కావడంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసక్తికరంగా, ఆయనతో పాటు భార్య భూమా మౌనిక కూడా ఆసుపత్రికి వచ్చారు. కానీ ఆసుపత్రి లోపలికి వెళ్లే ముందు మీడియా వారు అడిగిన ఏ ప్రశ్నకు వారు స్పందించలేదు.
ప్రస్తుతం మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో.. వైరల్ అవుతున్నాయి. అయితే కాలికి గాయం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. ఈ ఉదయం మంచు ఫ్యామిలీ.. సంబంధించి మరొక వార్త కూడా వైరల్ అయింది. ఆస్తుల వివాదంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు.. పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ మోహన్ బాబు ఈ వార్తలను ఖండించారు.
ఇది జరిగిన కాసేపటికి..మంచు మనోజ్..ఆసుపత్రికి వెళ్లడం ఈ ఉదయం వచ్చిన వార్తలపై చర్చలు మరింత ముదిరేలా చేసింది. ఈ విషయంపై మంచు ఫ్యామిలీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలు కొత్తవి కాదు. గతంలో మంచు విష్ణు-మనోజ్ మధ్య గొడవలు జరుగడం, వివాదాస్పద వీడియోలు వైరల్ కావడం జరిగింది. మనోజ్-మౌనిక వివాహంలో కూడా ఈ విభేదాలు బయటపడ్డాయి. ఈసారి ఈ గొడవ.. తండ్రికొడుకుల మధ్య జరిగిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం జరిగిన విషయంపై మంచు ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వివాదంపై ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందించకపోవడం నెటిజన్లలో సందేహాలు రేకెత్తిస్తోంది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచు మనోజ్ స్పష్టమైన వివరణ ఇస్తారో లేదో వేచి చూడాలి
Read more: Viral Video: పెళ్లైన హీరోకు క్యూట్‌గా ప్రపోజ్ చేసిన సమంత.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook