Manchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరుగుతున్న విషయం తెలిసిదే. ఇప్పుడు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టాడని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. గాయాలతో పోలీస్ స్టేషన్ వచ్చి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారని ప్రచారానికి తెర లేపారు. తనతో పాటు తన భార్యపై దాడి చేశారని మోహన్ బాబుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ వార్తలపై మోహన్ బాబు , మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం లేదని మంచు ఆఫీసు క్లారిటీ ఇచ్చింది. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపింది. ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దని.. వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది.
మరోవైపు మంచు మనోజ్ జీ తెలుగు న్యూస్‌తో మాట్లాడుతూ.. గొడవలపై క్లారిటీ ఇచ్చారు. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందని చెప్పారు. తన తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారని ఆరోపించారు. కచ్చితంగా ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.