Pavan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ పదవుల ఎంపికపై రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. పెద్దల సభకు ముగ్గురు ఎంపీలు వెళ్లే అవకాశం ఉండటంతో ఎవరెవర్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైసీపీకి చెందిన బీద మాస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య రాజీనామా చేయడంతో.. కూటమి పార్టీల నుంచి సభకు వెళ్లే అభ్యర్ధులు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూడు పదవులను టీడీపీ అట్టి పెట్టుకుంటుందా..! లేదంటే.. మూడు పార్టీలో ఒక్కో పోస్టు తీసుకుంటాయా అనే చర్చ మూడు పార్టీల నేతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ప్రచారం జరుగుతోంది..
ఒకవేళ టీడీపీ నుంచి పెద్దల సభకు బీద మస్తాన్ రావు, గల్లా జయ్‌దేవ్, ఆశోక్ గజపతి రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.. గతంలో వైసీపీ నుంచి పార్టీ మారిన బీద మస్తాన్ రావుకు ఎంపీ పదవి ఇస్తారని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు గల్లా జయ్‌దేవ్ కూడా రాజ్యసభ రేసులో ముందున్నట్టు సమాచారం. మరోవైపు కంభంపాటి రామ్మోహన్ రావు పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇన సాన సతీష్ సతీష్ పేరు కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.. అయితే ఈ నలుగురు నేతల్లో ఎవరో ఒకరికి రాజ్యసభ సీటు ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీకి సైతం ఓ సీటు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే రాజ్యసభ రేసులో మాజీసీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందున్నట్టు సమాచారం. మాజీ సీఎంకు గతంలో రాజ్యసభ పదవి ఇస్తారని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి పెద్దగా పోటీగా లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖాయమని చెబుతున్నారు. అటు సీఎం చంద్రబాబు సైతం బీజేపీకి ఓ సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అటు జనసేన పార్టీకి సైతం ఓ సీటు దక్కొచ్చని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం జనసేన నుంచి ఎవర్ని పెద్దల సభకు పంపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పెద్దల సభకు వెళ్లేందుకు మెగాబ్రదర్ నాగబాబు చాలా రోజులుగా ఆసక్తిగా ఉన్నారని జనసేన పార్టీ వర్గాలే అంటున్నాయి. మొదటి నుంచి జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్ లో ఉన్నారు. పవన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉన్న కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు. అటు తర్వాత ఏపీలో కీలక నామినేట్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కానీ తాజాగా నాగబాబు విషయంలో రాజ్యసభ సభ్యునిగా పంపాలని బీజేపీ, పవన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే నాగబాబునే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవడం వెనుక రాజకీయంగా అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఒకటి మాత్రం ఆసక్తిగా ఉంది. జనసేన తరుపున ఢిల్లీలో పవన్ తరుపున ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుంది అని బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారట. ప్రతినిధిగా పవన్ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు ఐన వ్యక్తి ఉంటే బాగుంటుందని బీజేపీ సూచన చేసిందట. ఆ ప్రతినిధితో బీజేపీ తన సందేశాలను పవన్ కు పంపించాలని ఉద్దేశమట. దీంతో నాగబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా ఇస్తే నిత్యం ఢిల్లీలో అందుబాటులో ఉంటారని వారి ఆలోచనట. అంతే కాదు ఇప్పటి వరకు జనసేన తరుపున కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేదు. నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే అది కూడా పూర్తి చేసినట్లు అవుతుందని బీజేపీ పవన్ కు సలహా ఇచ్చిందంట. దీనిపైనే పవన్ తో గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని టాక్.
మొత్తంగా ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాల్లో ఒక స్థానం నాగబాబుకు కేటాయిస్తారని ఏపీలో తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చించడానికే పవన్ ఢిల్లీ వెళ్లారని ఏపీ రాజకీయవర్గాల్లో టాక్సైతం వినిపిస్తోంది.
Also Read: MLC FIGHT: జీవన్‌కే మరో చాన్స్!
Also Read: Warangal Politics: ఆరూరి అలక.. కేసీఆర్ మెలిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.