Tirumala: తిరుపతి వాసులు ఎగిరి గంతేసే వార్త.. టీటీడీ నిర్ణయంతో ఉబ్బితబ్బైపోతున్న స్థానికులు.. డిటెయిల్స్..

Ttd srivari darshan: టీటీడీ శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పిందని తెలుస్తొంది. ఈ ప్రకటనతో స్థానికులు మాత్రం ఆనందంతో ఉన్నారంట.  ఆరోజు ఎప్పుడొస్తుందా.. అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారంట.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 30, 2024, 02:47 PM IST
  • తిరుపతి వాసులకు శుభవార్త చెప్పిన టీటీడీ..
  • హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
Tirumala: తిరుపతి వాసులు ఎగిరి గంతేసే వార్త.. టీటీడీ నిర్ణయంతో ఉబ్బితబ్బైపోతున్న స్థానికులు.. డిటెయిల్స్..

Ttd key decision on local devotees darshan on december3 rd: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎం అయ్యాక.. ముఖ్యంగా తిరుమలలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా స్వామి వారికి జరిగే కైంకర్యాల విషయంలో.. శ్రీవారి భక్తులకు ఎక్కడ కూడా సదుపాయాల్లో రాజీ పడేది లేదని స్పష్టమైన ఆదేశాలు  సైతం జారీ చేశారు.

కలియుగ దైవం.. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో తిరుమలలో గత పాలకులు.. మాత్రం వీఐపీ సేవల్లో తరించారని అపఖ్యాతి ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం.. వీఐపీ కల్చర్ ను పక్కన పెట్టి.. సామాన్య భక్తులే ప్రయారిటీగా శ్రీవారి దర్శనం అయ్యే విధంగా చూడాలన్నారంట. ఈ క్రమంలో కూటమి ఎన్నికల ప్రచారంలో సైతం.. తిరుమలలోని స్థానికులకు దర్శనం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా, కూటమి అధికారంలోకి రావడమే కాకుండా.. టీటీడీకి కొత్తగా పాలక మండలి సైతం ఏర్పాటు చేసింది. ఇటీవల బీఎస్ నాయుడును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనకూడా వచ్చి రాగానే.. తిరుమల టీటీడీపై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారంగా మారిన విషయం తెలిసిందే. టీటీడీలో హిందువులు మాత్రమే ఉద్యోగులుగా ఉండాలన్నారు.

అంతే కాకుండా.. తిరుమలలో స్వామి వారికి సేవలు, ఆచారాలు, సంప్రదాయల విషయంలో రాజీపడేది లేదన్నారు. ఇదిలా ఉండగా.. టీటీడీ ఇటీవల కొత్త పాల మండలి సమావేశం అయ్యింది. ఈ క్రమంలో తిరుమల స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. డిసెంబర్ 3 వ తేదీ అంటే.. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తొంది.

Read more: Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?

ఈ నేపథ్యంలో.. స్థానికులకు..  డిసెంబర్ 1న తిరుపతిలోని మహాతి ఆడిటోరియంలో అదే విధంగా..  తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో..ఉదయం 5 గంటలకు.. డిసెంబరు 3 వ తేదీ దర్శనం కోసం టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ అవవకాశాన్ని..... తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల వారు సద్వినియోగం చేసుకొవాలని టీటీడీ ఒక ప్రకటనలనలో కోరినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News