Almonds Side Effects: బాదం మంచిదే కానీ అతిగా అతిగా తింటే ఏమౌతుందో తెలుసా

Almonds Side Effects: శరీర నిర్మాణం, ఆరోగ్యం, ఎదుగుదలకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఈ పోషకాలన్నీ ప్రకృతిలో లభించే పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తాయి. అందులో ఒకటి బాదం. బాదంను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2024, 05:20 PM IST
Almonds Side Effects: బాదం మంచిదే కానీ అతిగా అతిగా తింటే ఏమౌతుందో తెలుసా

Almonds Side Effects: బాదం ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే రోజూ బాదం తింటే చాలా రకాల వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటారు. కానీ బాదం అతిగా తింటే మంచిది కాదంటున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చంటున్నారు. 

ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తినాలి. రుచిలోనే కాకుండా ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉండటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని కొంతమంది అతిగా సేవిస్తుంటారు. బాదం మోతాదుకు మించి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. బాదం పరిమితికి మించి తినడం వల్ల శరీరంలో హెచ్‌సీఎన్ లెవెల్స్ పెరిగి శ్వాసలో ఇబ్బంది ఎదురౌతుంది. నాడీ వ్యవస్థ బ్రేక్ డౌన్ కావచ్చు. ఊపిరి పీల్చడంలో అంతరాయం కలగవచ్చు. మోతాదుకు మించి తినడం వల్ల కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇందులో ఉండే ఆక్సలేట్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. 

బాదం రోజూ అతిగా తినడం వల్ల బరువు పెరిగి స్థూలకాయం సమస్య రావచ్చు. కడుపు చుట్టూ ఫ్యాట్ పేరుకుపోయే ప్రమాదముంది. అందుకే మోతాదుకు మించి తినకూడదు. బాదం అతిగా తింటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కాల్షియం, ఐరన్, జింక్ మెగ్నీషియం సంగ్రహణలో ఆటంకం కలుగుతుంది. అందుకే పరిమితి మించి తినకూడదంటారు వైద్యులు. బాదంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎక్కువ తినడం వల్ల విటమిన్ ఓవర్ డోస్ అయి హ్యామరేజ్ వంటి తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి. 

రోజూ అదే పనిగా బాదం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో విష వ్యర్ధాలు పేరుకుపోతాయి. ఇవి కడుపుకు మంచిది కాదు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు బాదంకు దూరంగా ఉండాలి. బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తింటే జీర్ణ సమస్య ఎదురై మలబద్ధకం ఇబ్బంది కలగవచ్చు. 

Also read: 8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News