Bulldozer Cases: బుల్డోజర్ కూల్చివేతలపై మండిపడిన సుప్రీంకోర్టు, కొత్త మార్గదర్శకాలు జారీ

Bulldozer Cases: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరైందని కాదని, ఆ అధికారం ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 13, 2024, 12:55 PM IST
Bulldozer Cases: బుల్డోజర్ కూల్చివేతలపై మండిపడిన సుప్రీంకోర్టు, కొత్త మార్గదర్శకాలు జారీ

Bulldozer Cases: బుల్డోజర్ల న్యాయంపై సుప్రంకోర్టు సంచలన తీర్పు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.  న్యాయస్థానాలుండగా అధికారులే ఆ పాత్ర పోషించడం సరైంది కాదని మండిపడింది. ఇళ్లను కూల్చడం అంటే హక్కుల్ని కాలరాయడమేనని తెలిపింది.

దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుల పేరుతో ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ వ్యవహారాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. కూల్చివేతలకు మతంతో సంబంధం ఉండకూడదని తెలిపింది. యూపీ సహా పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్ కూల్చివేతలపై దాఖలైన వివిధ పిటీషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అధికారులు న్యాయమూర్తులు కారు, కాలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన విధానం పాటించకుండా ఇళ్లు కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని, దోషిగా శిక్ష పడినా సరే ఆ వ్యక్తి ఇంటిని కూల్చడం సరైంది కాదని తెలిపింది. ఏ చట్టాలైనా రాజ్యాంగానికి లోబడి ఉండాలని, ఇళ్లు కూల్చివేత నోటీసుల్ని సవాలు చేసేందుకు ప్రజలకు తగిన సమయం ఇవ్వాలని వెల్లడించింది.

కూల్చివేత తప్పనిసరి అయితే 15 రోజుల ముందస్తు నోటీసు తప్పకుండా ఇవ్వాలని, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించడం, ఇంటికి అతికించడం, మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్‌లో ఉంచడం చేయాలని తెలిపింది. అక్రమ నిర్మాణాలకే ఈ తరహా అవకాశముండాలని వెల్లడించింది. కూల్చివేతను తప్పకుండా వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఎందుకు కూలుస్తున్నారో కారణాలు వెల్లడించాలి. ఈ నిబంధనలు ఇకపై ఎక్కడైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారుల జీతాల్నించి జరిమానా వసూలు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, 53 శాతం డీఏతో కనీస వేతనం పెరగనుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News