తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఆసియా ఖండంలో అత్యంత ధనిక కుటుంబాల జాబితా 2017లో శాంసంగ్ అధినేత లీ కుటుంబాన్ని వెనక్కినెట్టి ముఖేష్ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి అంబానీ కుటుంబ ఆదాయం 19 బిలియన్ డాలర్లు పెరిగి 44.8 బిలియన్ డాలర్లకు చేరుకోగా, లీ కుటుంబం 11.2 డాలర్లు పెరిగి 40.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ జాబితాలో ముఖేష్ తరువాత లీ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. స్టాక్, కరెన్సీ ఎక్స్చేంజి పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను ఫోర్బ్స్ సిద్ధం చేసింది. మూడవ స్థానంలో 40.4 బిలియన్ డాలర్లతో హాంక్ కాంగ్ కు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం క్వోక్ ఫ్యామిలీ, నాలుగవ స్థానంలో 36.6 బిలియన్ డాలర్లతో థాయిలాండ్ చేరవనోన్ట్ ఫ్యామిలీ నిలిచింది.
ఫోర్బ్స్ జాబితాలో భారతీయ కుటుంబాలు
ఫోర్బ్స్ ప్రకటించిన లిస్ట్ లో 18 మంది ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. అందులో అజీమ్ ప్రేమ్ జీ ఫ్యామిలీ 11వ ర్యాంక్ (19.2 బిలియన్ డాలర్లు), హిందుజా ఫ్యామిలీ 12వ ర్యాంక్ (18.8 బిలియన్ డాలర్లు), మిట్టల్ ఫ్యామిలీ 14వ ర్యాంక్ (17.2 బిలియన్ డాలర్లు), మిస్త్రీ ఫ్యామిలీ 16వ ర్యాంక్ (16.1 బిలియన్ డాలర్లు), బిర్లా ఫ్యామిలీ 19వ ర్యాంక్ (14.1 బిలియన్ డాలర్లు) దక్కింది.