Case on Gangavva: యూట్యూబర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, అక్కడ నాలుగు వారాలకే ఆరోగ్యం సహకరించలేదని హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ.. ఆ తర్వాత ఇంటిని నిర్మించుకునే పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో మై విలేజ్ షో అనే తన.. ఛానల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే.
యూట్యూబర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, అక్కడ నాలుగు వారాలకే ఆరోగ్యం సహకరించలేదని హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ ఆ తర్వాత ఇంటిని నిర్మించుకునే పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో మై విలేజ్ షో అనే తన ఛానల్లో నిమగ్నమైన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన.. గంగవ్వ ఇక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమెపై కేసు ఫైల్ అయినట్లు సమాచారం. గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజు పై కూడా కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు.
జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదిలాపురం గౌతమ్ ఫిర్యాదు చేయడం జరిగింది. మై విలేజ్ షో యూట్యూబ్లో చిలకలని ఉపయోగించడం పై ఆయన అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మే 22, 2022 రోజున యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియోని అప్లోడ్ చేశారు. ముఖ్యంగా యూట్యూబ్ ప్రయోజనాల కోసం గంగవ్వ రాజు చిలకలను ఉపయోగించి, హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంగించారు అంటూ ఆయన తన ఫిర్యాదులో తెలిపారు.
వినోదం కోసం చిలుకలను ఉపయోగించడం చట్టం ఉల్లంగిన కేసు క్రిందకి వస్తుందని ఫిర్యాదుదారుడు గుర్తు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే గంగవ్వ , రాజు పై కేసు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం గంగవ్వ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేస్తోంది .
ఇలాంటి సమయంలో ఈమెపై కేసు నమోదు చేయడంతో ఇక ఈవారం ఈమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తారా లేక ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు పోలీసులు ఎదురు చూస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.
మరొకవైపు ఈమె కోసం బిగ్ బాస్ కి నోటీసులు పంపే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా గంగవ్వపై.. కేసు ఫైల్ చేయడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter