Dakshina: సాయి ధన్సిక దక్షిణ కి విడుదల తేదీ ఖరారు.. ప్రతి సీన్ అదిరిపోతుందట..

Dakshina Trailer: మంత్ర, మంగళ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ఓషో తులసీరామ్.. తాజాగా ఇప్పుడు దక్షిణ అనే మరొక సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 20, 2024, 06:26 PM IST
Dakshina: సాయి ధన్సిక దక్షిణ కి విడుదల తేదీ ఖరారు.. ప్రతి సీన్ అదిరిపోతుందట..

Dakshina Release Date: ఈ సంవత్సరం విడుదలైన చాలా వరకు చిన్న సినిమాలు.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు ఎక్కువగా హడావిడి చేశాయి. తాజాగా ఇప్పుడు మరొక చిన్న సినిమా ఈ నేపథ్యంలో విడుదల కి సిద్ధం అవుతుంది. అదే దక్షిణ.

సాయి ధన్సిక నటించిన దక్షిణా సినిమా అక్టోబర్ 4న విడుదలకు సిద్ధం అవుతుంది. మంత్ర, మంగళ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఓషో తులసీ రామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా ఈ సినిమా తెరకెక్కనుంది.

కబాలి ఫేమ్ సాయి ధన్షిక హీరోయిన్ గా.. మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు కీలక పాత్రలో నటించారు. ఈమధ్యనే. విడుదల అయిన చిత్ర గ్లిమ్స్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ట్రైలర్ ను ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు లాంచ్ చేసారు. అక్టోబర్ 4న దక్షిణ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. 

థ్రిల్లింగ్ సినిమాలకు ఈ సినిమా ఒక సరికొత్త డిఫనేషన్ లాగా ఉంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత అశోక్ షిండే.. సినిమాలోని ప్రతిసాన్నివేశం ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతుంది అని.. అక్టోబర్ 4 న విడుదలవుతున్న దక్షిణ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని అన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 

స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి, నవీన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. రామకృష్ణ (ఆర్ కే) ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. బాలాజీ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Also Read:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

Also Read: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News