Andhra Pradesh Politics: అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. అధికారం మారినా కూడా ప్రభుత్వ పత్రాల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఫొటో కొనసాగించడం రాజకీయంగా తీవ్ర వివాదం రేపుతోంది. అధికారుల నిర్వాకంతో ఈ భారీ తప్పిదం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read: Fake News Spread: బుడమేరుకు మళ్లీ గండి వార్తలు కలకలం.. వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
ఏం జరిగింది?
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెంటాలవారిగూడేనికి చెందిన బాలు శ్రీనివాసరావుకు దబ్బాకుపల్లి రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఉంది. దానిపై రుణం తీసుకునేందుకు గురువారం వత్సవాయిలోని ఇండియన్ బ్యాంకుకు వెళ్లారు. అక్కడి బ్యాంకు అధికారులు భూమికి సంబంధించిన అండగల్ పత్రం అడిగారు. కాకరవాయి గ్రామానికి వెళ్లి మీ సేవా కేంద్రంలో అండగల్ తీసుకున్నారు. అయితే ఆ పత్రంపై నవరత్రాల పథకం లోగో ఉంది. సీఎంగా జగన్ బొమ్మ కనిపించడం చూసి శ్రీనివాసరావు విస్తుపోయారు. ఇదేమని ప్రశ్నించగా.. 'ఇంకా కొన్ని రోజులు అలాగే వస్తాయిలే' అంటూ మీసేవ నిర్వాహకుడు సమాధానమిచ్చాడు.
Also Read: Anchor Shyamala: యాంకర్ శ్యామలకు కీలక పదవి.. వైయస్ జగన్ కొత్త ప్లాన్..!
కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా కొందరు అధికారులు, సిబ్బందిలో ఇంకా మార్పు రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరించడం రాజకీయంగా.. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికీ వైఎస్ జగన్ పై అధికారులు అభిమానం చూపిస్తున్నారని.. వైఎస్సార్ సీపీకి భజన చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధ్రువపత్రంపై జగన్ ఫొటో రావడం మరింత వివాదం రేపుతోంది.
తప్పిదం ఇక్కడే..
ఈ ఫొటో వివాదం తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. మీసేవా నిర్వాహకుడి వద్ద పాత పత్రాలు మిగిలిపోవడంతో ఆ పత్రంపై ప్రింటింగ్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత పత్రాలను తహసీల్దారు కార్యాలయానికి సరెండర్ చేయాల్సి ఉండగా కొందరి వద్ద ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. మీసేవ, వీఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.