TGSRTC good news for both telugu states on floods: రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు పూర్తిగా అతలాకుతలంగా మారిపోయాయి. ఎక్కడ చూసిన రోడ్లన్ని జలమయమైపోయాయి. తెలుగు స్టేట్స్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలలో కూడా వరదలు భారీగా కన్నీళ్లను మిగిల్చాయి. ఇదిలా ఉండగా... ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలు బురదతో నిండిపోయి ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి వరదలు సంభవించాయి. అంతేకాకుండా.. ప్రజాజీవమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.
తెలంగాణలో ముఖ్యంగా.. ఖమ్మం వరద ముంపుకు గురైంది. అక్కడి అనేక ప్రాంతాలు కూడా బురదతో నిండిపోయాయ. కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి అన్నం లేని పరిస్థితినెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాకారం అందలేదని కూడా, చాలా మంది ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.
మరోవైపు ఏపీలో కూడా సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి వరదల్లో ఉండి విజయవాడలో, బాధితులకు వరదసహాయం అందేలా చూస్తున్నారు. అంతేకాకుండా.. ఎక్కడ కూడా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చివరి బాధితుల వరకు కూడా నిత్యవసరాలు అందేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు,మంత్రులతో సమన్వయం చేసుకుంటూ సహాయ కార్యక్రమాలలో యాక్టివ్ గా ఉంటున్నారు. హైదరాబాద్ ,విజయవాడ రూట్ కూడా దారుణంగా పాడైంది.
ఈ క్రమంలో అధికారులు ఇప్పుడిప్పుడు ఆ మార్గాన్ని పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) కీలకమైన ప్రకటన చేసింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ రూట్‌లో రాకపోకలు కొసాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్టు టీజీఆర్టీసీ వెల్లడించింది.
Read more: Pushpa 2: ఇదేంపైత్యం రా నాయన.. ‘పుష్ప-శ్రీవల్లీ’ వినాయకుడంటా.. చూశారా..?
రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో కూడా ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ప్రయాణీకులను సంస్థ కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని కూడా టీజీఆర్టీసీ కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.