Hyderabad To Vijayawada : తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. దాదాపు 28 గంటల తర్వాత NH 65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు దగ్గర కొత్త వంతెన మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే వాహనదారులు బ్రిడ్జిపై నెమ్మెదిగా వెళ్లాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం దగ్గర వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నారు. ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గర ఉండి మరీ పంపిస్తున్నారు.
కాగా విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై ఎన్టీఆర్ జిల్లా ఐతవరం దగ్గర వరద ప్రవహిస్తుండటంతో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటక్రుష్ణ ప్రసాద్ పోలీసులు, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వాహనంలో ఎక్కి వరదను దాటి ముందుకు వెళ్లారు. గత మూడు రోజులుగా మైలవరం నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే..తన సొంత గ్రామం ఐతవరానికి వచ్చారు. మధ్యలో వరద ఉండటంతో హైడ్రా వాహనంలో ఎక్కి బయటకు వెళ్లారు.
Also Read : Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ
మున్నేరు వాగు పొంగిపొర్లడంతో ఐతవరం సమీపంలో జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచింది. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్ ప్లాజా దగ్గర పోలీసులు నిలిపివేశారు. నార్కట్ పల్లి నుంచి 65వ నెంబర్ జాతీయరహదారిపై ట్రాఫిక్ ను నార్కట్ పల్లి, అద్దంకి హైవేకు మళ్లించారు. ఈ రోడ్డుపై భారీగా రద్ది పెరిగింది. నల్లగొండ జిల్లాలోని నార్కట్ పల్లి నుంచి దామరచర్ల వరకు ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. అయితే క్రమంగా వరద ఉద్ద్రుతి తగ్గడంతో వాహనాల వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
Also Read : Chandrababu naidu: చేతకాకపోతే వెళ్లిపోండి.. అధికారులకు చంద్రబాబు మాస్ వార్నింగ్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter