Bride and groom relatives fight for mutton video viral: పెళ్లిని ప్రతి ఒక్కరుతమ జీవితంలో మర్చిపోలేని విధంగా జరుపుకునేందుకు ప్లాన్ లు చేస్తుంటారు. దీని కోసం ఎంత ఖర్చుచేయడానికి సైతం వెనుకాడరు. కొంత మంది వెడ్డింగ్ ఆర్గనైజర్ లను సైతం కలుస్తుంటారు. తమ వెడ్డింగ్ ను వెరైటీగా ప్లాన్ లు చేసుకుంటారు. ప్రీవెడ్డింగ్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క వేడుక ఎంతో గ్రాండ్ గా జరుపుకొవాలని కలలు కంటారు.ఈ క్రమంలో పెళ్లి సంబంధించిన వెరైటీ ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి.
మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.
దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/vQsbG02gZU
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2024
కొన్నిసార్లు వధువరులు వెరైటీగా పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తుంటారు. మరికొన్ని సార్లు పెళ్లి మండపంలో షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటాయి. పెళ్లికొడుకు తాగి రావడం, బట్టతల ఉన్న విషయం తెలవడం, కట్నంతేలేదని గొడవలు జరిగి పెళ్లి ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరికొన్నిసార్లు మాజీ ప్రియులు పెళ్లి మండపానికి ఎంట్రీ ఇవ్వడం, సడెన్ గా పెళ్లి కూతురు తనకు పెళ్లి ఇవ్వడంలేదని వెళ్లిపోయిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి. అదే విధంగా పెళ్లిలో కొన్నిసార్లు చికెన్ లు, మటన్ ల కోసం అనేక గొడవలు జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
తెలంగాణలోని నందిపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నవీపేట్ లో ఒక జంట వివాహ వేడుక ఎంతో గ్రాండ్ గా జరింది. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున బంధువులు చాలా మంది హజరయ్యారు. పెళ్లివేడుక కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే.. పెళ్లిలో వధువరులను అందరు ఆశీర్వదించారు. గిఫ్ట్ లు కూడా ఇచ్చేశారు. ఇంకా.. భోజనాలకు వెళ్లిపోయారు. అక్కడ మటన్ ఉండంటంతో.. చాలా మంది తినేందుకు ఆసక్తి చూపించారు.
అయితే.. ఇక్కడే పెద్ద రచ్చ జరిగింది. అక్కడ మటన్ ముక్కల కోసం లైన్ లలో నిలబడ్డారు. వధువరుల తరపు బంధువులు.. మటన్ కోసం వాగ్వాదం చేసుకున్నారు. ఇది కాస్త ఒక లిమిట్ ఒకర్నిమరోకరు తోసేసుకున్నారు. అంతేకాకుండా.. అది కాస్త కొట్టుకొవడం వరకు వెళ్లింది. ఇంతలో కొందరు రాళ్లు, కర్రలతో అక్కడ బీభత్సం చేశారు. కొంత మందికి ఈ గొడవల్లో తలలు కూడా పగిలాయి.
దీంతో పచ్చని పెళ్లి కాస్త రణరంగంగా మారింది. అక్కడ కొంత మంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగాగాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కొంత మంది యువకులు.. గొడవలు జరుగున్నప్పుడు వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.