Ghee And Rice Mixed Benefits: భారతీయులు నెయ్యిని వివిధ రకాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఎక్కువగా దీనిని స్వీట్ల తయారీలో.. ఇతర ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఈ నెయ్యికి ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇందులో అనేక రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అందుకే దీనిని అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా వినియోగిస్తారు. నిజానికి నెయ్యిలో అనేక రకాల పోషకాలతో పాటు మూలకాలు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులనుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కువగా వ్యాయామాలు చేసే వారికి నెయ్యి ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే కేలరీలు కండరాల నిర్మాణాన్ని పెంచి శక్తినిచ్చేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇదిలా ఉంటే నెయ్యిని అన్నంలో కలిపి తినడం వల్ల కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
నెయ్యిని అన్నంలో కలిపి తినడం వల్ల కలిగే లాభాలు:
శక్తిని అందిస్తుంది:
నెయ్యిలో శరీరానికి కావలసిన అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా కేలరీలు మంచి కొవ్వులు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు వ్యాయామాలు జిమ్ చేసేవాళ్ళు తప్పకుండా నెయ్యిని అన్నంలో కలుపుకొని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కండరాలు కూడా దృఢంగా మారతాయి.
పోషకాలు:
నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి దీనిని అన్నంలో కలుపుకొని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా తరచుగా ఇన్ఫెక్షన్లు ఇతర సమస్యలతో బాధపడే వారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది.
మెదడుకు మేలు చేస్తుంది:
నెయ్యిలో ఉండే కొవ్వు గుణాలు మెదడుకు ఎంతగానో మేలు చేస్తాయి. దీనికి కారణంగా మెదడుకు సంబంధించిన కణాలు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే జ్ఞాపక శక్తి తగ్గడం, మెదడులోని ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా నెయ్యి అన్నంలో కలుపుకొని తినాల్సి ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది:
నెయ్యిలో ఉండే గుణాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా మలబద్ధకం ఇతర పొట్ట సమస్యలను తగ్గించి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా గ్యాస్టిక్ సమస్యలతో బాధపడే వారు కూడా నెయ్యిని అన్నంలో కలిపి తినడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
చర్మం, జుట్టుకు మేలు:
నెయ్యిని అన్నంలో కలిపి తినడం వల్ల చర్మం, జుట్టును మెరుగుపడుతుంది. దీంతోపాటు చర్మం చాలా మృదువుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.