Good News To Boys: ఇన్నాళ్లు వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు పింఛన్ ఇస్తుండగా.. తాజాగా అబ్బాయిలకు కూడా అలాంటి సదుపాయమే కల్పించేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా అబ్బాయిలకు భృతి ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అబ్బాయిల విద్యాభ్యాసానికి తగ్గట్టు భృతి అందించనుంది. ఈ మేరకు మరాఠా ప్రభుత్వం పథకం అమలుకు అడుగులు వేస్తోంది.
Also Read: Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..
ఎన్నికల సమయంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం లాడ్లా భాయ్ యోజన అనే పథకం అమలు చేస్తామని ప్రకటించింది. అబ్బాయిలకు నిరుద్యోగ భృతీ అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్ల ఎన్నికలకు మళ్లీ సమయం రావడంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. లాడ్లా భాయ్ యోజన పథకం అమలుకు చేసేందుకు అధికారులకు ఆదేశించారు.
Also Read: Airtel Free Plans: ఆ ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్‌తో సోనీలివ్ సహా 20 ఓటీటీలు ఉచితం
ఏమిటి లాడ్లా భాయ్ యోజన?
అన్ని వర్గాలకు ఆర్థిక సహాయం అందిస్తుండగా ఒక్క అబ్బాయిలకు మాత్రం ఎలాంటి పథకం అమలు కావడం లేదు. పెద్ద ఎత్తున యువకులు ఉండడంతో వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం లాడ్లా భాయ్ యోజనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అబ్బాయిల విద్యార్హతలకు అనుగుణంగా భృతి అందిస్తారు.
12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సహాయం
డిప్లొమా విద్యార్థులకు నెలకు రూ.8 వేల ఆర్థిక సహాయం అందజేత
డిగ్రీ చేసిన అబ్బాయిలకు నెలకు రూ.10 వేల చొప్పున అందిస్తారు.
ఇప్పటికే మహిళలకు..
మాఝీ లడ్కీ బహిన్ యోజన కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1500 చొప్పున నెలకు భృతి అందిస్తోంది.
లోక్‌సభ ఫలితాలతో..
అనూహ్యంగా అబ్బాయిలకు భృతి అందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువత ఆగ్రహంలో ఉండడంతో వారిని శాంతపర్చేందుకు నిరుద్యోగ భృతిని తెరపైకి తీసుకొచ్చింది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో అధికార కూటమికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 30 సీట్లను సొంతం చేసుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని ముందరవేసుకుంది. యువత ఓట్లు చేజారకుండా నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి