Arvind Krishna: అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటులలో ఒకరు అరవింద్ కృష్ణ. రవితేజ హీరోగా చేసిన
రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తరువాత 'శుక్ర', 'సిట్' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. త్వరలోనే.. మాస్టర్ పీస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
'ఎ మాస్టర్‌పీస్: రెయిజ్ ఆఫ్ సూపర్‌హీరో' టైటిల్ తో రానున్న ఈ చిత్రం త్వరగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో అరవింద్ కృష్ణను 'వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా' పురస్కారం వరించింది. ఈ నటుడు..ఈ మధ్యనే నటించిన.. 'సిట్' గత రెండు నెలలగా ట్రెండింగ్‌లో ఉంది. ఇక సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతోనే కాదు, వీగన్ లైఫ్‌స్టైల్‌తోనూ కూడా తరచుగా హెడ్లైన్స్ తో నిలుస్తూ ఉంటారు. కాగా గత కొద్ది సంవత్సరాలుగా ఈ హీరో అనుసరిస్తున్న వీగన్ లైఫ్‌స్టైల్‌కి గాను..అరుదైన గుర్తింపు దక్కింది. ఇక ఎందుకు కానీ అరవింద్ కృష్ణ కి 'వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా' పురస్కారాన్ని అందించారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. ఈ హీరో గత రెండు సంవత్సరాలుగా వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముంబై సిటీలో జరిగిన వీగన్ ఇండియా కాన్ఫెరెన్స్ లో కూడా పాల్గొన్నారు. అరవింద్ కృష్ణతో పాటు బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్ఫాండెస్.. ఈ కార్యక్రమంలో పాల్గొనింది. ఈ నేపథ్యంలో వీగన్ జీవన శైలికి సంబంధించి ఇద్దరూ తమ ఆలోచనలను.. ఆ వేదిక పైన పంచుకున్నారు. ఇక ఈ వేడుకలోనే అరవింద్ కృష్ణను 'వీగన్ వాయిస్ ఆఫ్ ఇండియా' పురస్కారంతో సత్కరించారు.
ఈ క్రమంలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. 'వీగనిజమ్ నేను నమ్మే సిద్ధాంతం” అని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లడుతూ ''ఈ పురస్కారాన్ని నేను చాలా బాధ్యతతో స్వీకరిస్తున్నాను. నేను బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, మరింత సమర్థవంతంగా ఆచరించడానికి, అలానే ఇదే సిద్ధాంతాన్ని నలుగురికీ పంచడానికి.. ఈ పురస్కారం నాలో బలమైన స్ఫూర్తి తీసుకొచ్చింది.. అని తెలియచేసారు.
అరవింద్ కృష్ణ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా.. కావడంతో.. ఈ నటుడు.. తాను ఆటల్లో రాణించటానికి కారణం కూడా వీగనిజాన్ని ఫాలో అబ్బదమే అని చెప్పుకొచ్చారు స ''కండరాల దృఢత్వానికి, గ్రౌండ్‌లో సమర్థవంతంగా అట ఆడటానికి, అలానే చురుకుగా వ్యవహరించడానికి నా వీగన్ జీవన శైలి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి కోసం, నేను నమ్మే నైతికత కోసం.. నేను ఎప్పటికీ వీగన్‌గా కొనసాగుతాను'' అని చెప్పారు అరవింద్ కృష్ణ.
Read more: Rat in Chutney: చట్నీలో చిట్టెలుక ఎంత బాగా ఈత కొడుతుందో చూశారా..?.. వీడియో ఇదిగో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి