YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల ఫలితాల వెల్లడి కావడానికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఈ ఎన్నికల్లో ఎవరూ విజయం సాధిస్తారోనని తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఫలితాల వెల్లడి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. మళ్లీ విజయం సాధిస్తామని పరోక్షంగా చెప్పారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఐదేళ్లు గడిచిన సందర్భాన్ని నెమరువేసుకున్న జగన్ ఇప్పుడు ఫలితాలపై స్పందించారు.
Also Read: YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్ జగన్ ట్వీట్ వైరల్
ఏపీ ఎన్నికల ఫలితాలపై సోమవారం రాత్రి 9.13 సమయంలో వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. 'ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను' అని 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
ఎన్నికలపై పూర్తి ధీమా
మూడు పార్టీలు కూటమిగా కలిసి వస్తుండగా వైఎస్ జగన్ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కూటమి వర్సెస్ వైఎస్సార్‌సీపీ మధ్య జరిగే పోరులో తాము విజయం సాధిస్తామని అధికార పార్టీ పూర్తి ధీమాతో ఉంది. రెండేళ్ల నుంచి 175కు 175 అనే లక్ష్యంతో దూసుకెళ్లగా.. ఎన్నికల ముందు మాత్రం లక్ష్యం తగ్గింది. కావాల్సిన మెజార్టీ కన్నా అత్యధిక స్థానాలు సాధిస్తామనే ధీమాలో వైఎస్సార్‌సీపీ ఉంది. అదే విశ్వాసాన్ని జగన్ వ్యక్త చేస్తున్నారు.
Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
అంతకుముందు మే 30వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజును జగన్ గుర్తుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు కూడా విజయంపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. రెండోసారి ప్రభుత్వంలోకి వస్తున్నామని.. ఇన్నాళ్లు అందించిన సంక్షేమ పాలనను కొనసాగిస్తామని ప్రకటించారు. 'దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది' అని ఆరోజు జగన్ ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ... ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి మన పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 3, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter