Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..

Mohanlal: మోహన్‌లాల్ కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో 'లూసీఫర్' మూవీ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ అంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం నడిచింది. తాజాగా 'ఎల్ 2 ఎంపురాన్' అంటూ (L2 Empuraan) అంటూ లూసీఫర్ 2 మూవీ సీక్వెల్ ప్రారంభమైంది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 22, 2024, 03:18 PM IST
Mohanlal: క్రేజీ బ్లాక్ బస్టర్‌ సీక్వెల్‌లో జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్.. ఫస్ట్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్..

Mohanlal: మోహన్‌లాల్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. నటుడిగా ఒక జానర్‌కు పరిమితం కాకుండా అన్ని జానర్స్‌లో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్న అతికొద్ది హీరోల్లో మోహన్‌లాల్ ఒకరు. తాజాగా ఈయన లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌గా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి మంచి పేరు పేరుంది. ఫస్ట్ టైమ్ మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఓ భారీ బ‌డ్జెట్ సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ ‘L2 ఎంపురాన్’. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు ఎంతో కీలకం అని చెప్పాలి. ద‌క్షిణాదిలో టాప్ యాక్ట‌ర్స్‌తో క‌లిసి ఓ కొత్త సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతోంది.

2019లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2 ఎంపురాన్’ తెరకెక్కుతోంది.  తొలి భాగం హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న మూడో  సినిమా. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా ఎపుడెస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది. అబ్రమ్ ఖురేషి పాత్ర‌ను ప‌రిచ‌యం చేయ‌టంతో లూసిఫ‌ర్ సినిమా ముగుస్తుంది. ‘L2 ఎంపురాన్’  విష‌యానికి వ‌స్తే ఆ పాత్ర‌ను తాలూకు ఫ్లాష్‌ బ్యాక్‌ను చూపించబోతున్నారు. స్టీఫెన్ నెడుంప‌ల్లి అస‌లు ఖురేషి అబ్ర‌మ్‌గా ఎలా మారాడ‌నే విష‌యాన్నిఈ సినిమా ప్రీక్వెల్‌లో చూపించ‌బోతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను భారీ లూసీఫర్‌ను మించేలా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.

‘L2 ఎంపురాన్’ పోస్ట‌ర్‌లో ఖురేషి అబ్ర‌మ్‌గా మోహ‌న్ లాల్ కొత్తగా క‌నిపిస్తున్నారు. మరోసారి డాన్‌ పాత్రలో మోహన్‌లాల్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్ పాత్ర కూడా ఎక్కువ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ‘L2 ఎంపురాన్’ పోస్ట‌ర్‌తో లూసిఫ‌ర్ మూవీలో స్టీఫెన్ నెడుంప‌ల్లి పాత్ర‌ను అంద‌రికీ యాద్ చేసింది. అందులో మోహ‌న్ లాల్ తెల్ల‌టి చొక్కా, పంచె ధ‌రించి ఉంటారు. రాజకీయంగా త‌న అనుచ‌రుల‌ను సెక్ర‌టేరియ‌ట్ వైపు న‌డిపిస్తారు. ఖురేషి అబ్ర‌మ్ విష‌యానికి వ‌స్తే ఆ పాత్ర‌లో మోహ‌న్ లాల్ న‌ల్ల‌టి దుస్తుల‌ను ధ‌రించి ఉన్నారు. అత‌ని వెనుక ఏదో తెలియ‌ని ర‌హస్యం దాగింద‌ని ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో చూపించారు.

ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  సెట్స్ నుంచి  లీకైన ఫొటోను గ‌మ‌నిస్తే అందులో మంజు వారియ‌ర్ పాత్ర నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస్‌లో ఉంటుంది.
లడఖ్, చెన్నై, కొట్టాయం, యుఎస్ మరియు యుకెతో సహా ప‌లు చోట్ల సినిమా చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ తిరువనంతపురంలో జరుగుతోంది. త్వ‌ర‌లోనే గుజరాత్, యుఎఇకి కూడా టీమ్ వెళ్లనుంది.

2025లో మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ సహా ప్యాన్ భారత్  భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ‘L2 ఎంపురాన్’  బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ రూ.500 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మోహ‌న్ లాల్ అభిమానుల‌ను, సినీ ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకునేలా పెద్ద‌ స్టార్స్‌, గొప్ప సాంకేతిక నిపుణుల క‌ల‌యిక‌గా ‘L2 ఎంపురాన్’ తెర‌కెక్కుతోంది. మోహ‌న్ లాల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ విశేషాలు బ‌య‌ట‌కు రావ‌టంపై అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్టీఫెన్ నెడుంప‌ల్లి పాత్ర‌లో మోహ‌న్ లాల్‌ను వెండితెరపై చూద్దామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News