Ravi Teja 75: రవితేజ తెలుగులో డిఫరెంట్ డైలాగ్ డెలవరీతో పాటు యాటిట్యూడ్‌తో దాదాపు 2 దశాబ్దాలుగా హీరోగా అలరిస్తున్నాడు. హీరోగా ఉంటూ కామెడీని పండించడంలో రవితేజది డిఫరెంట్ స్టైల్. ఎక్కుడ మాస్ కామెడీ పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరో రవితేజనే. రవితేజ తన కెరీర్లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగ రవితేజ తన కెరీర్లోనే లాండ్ మార్క్ 75వ చిత్రాన్ని ఉగాది పండగ పర్వదినం సందర్భంగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో భాను భోగవరపు డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. ఉగాది పండగ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి..హ్యాపీ ఉగాది రా భయ్( అని తెలంగాణ యాసలో ఉంది. ఊరి జాతరను చూసిస్తూ విభిన్నంగా ఉంది. దీంతో ఈ సినిమాలో రవితేజ పూర్తి తెలంగాణ ప్రాంత యువకుడిగా కనిపించబోతుండు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో కూడా తెలంగాణ యాసలో మెప్పించిన రవితేజ.. ఇపుడు మరోసారి తెలంగాణ యాసతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2025 కు 'ధూమ్ ధామ్ మాస్' దావత్ అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాఉక సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు... రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు 'లక్ష్మణ భేరి' అని తెలియజేసారు. అంతేకాదు ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో
ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. "ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో" అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసిన వర్డ్స్ ఎగ్జైటింగ్‌గా ఉంది. అంతేకాదు
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Shobha Karandlaje: ప్రచారంలో అపశ్రుతి.. కేంద్ర మంత్రి కారు తగిలి కార్యకర్త మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook