Summer Skincare: ఎండకాలం పడుకునే ముందు మహిళలు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకోవాలి!

Summer Skincare Tips: ఎండకాలం మండిపోతుంది. సాధారణంగా మనం కేవలం చలికాలంలోనే చర్మ సంరక్షణ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో చర్మం త్వరగా పొడిబారిబోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Mar 21, 2024, 02:35 PM IST
Summer Skincare: ఎండకాలం పడుకునే ముందు మహిళలు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకోవాలి!

Summer Skincare Tips: ఎండకాలం మండిపోతుంది. సాధారణంగా మనం కేవలం చలికాలంలోనే చర్మ సంరక్షణ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్లో చర్మం త్వరగా పొడిబారిబోతుంది. అయితే, ఎండకాలం కూడా ఇలా స్కిన్ పై సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎండకాలం బయటకు వెళ్లినప్పుడు సరైన స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సూర్యుడి నుంచి వచ్చే హానికర అల్ట్ర వైలట్ కిరణాలతో చర్మం పాడవుతుంది. అందుకే బయటకు వెళ్లినప్పుడు ముఖానికి స్కాఫ్ తప్పనిసరిగా ధరించాలి. అంతేకాదు ముఖానికి ఎస్‌పీఎఫ్ మాత్రమే ఉండే సన్‌స్క్రీన్ రుద్దుకుని బయటకు వెళ్లాలి. అయితే, పగటిపూట ఎక్కువ ఖరీదు ఉండే క్రీములను రాసుకుంటాం. అలాగే రాత్రి సమయంలో కూడా సరైన చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవాలి.

మన ముఖంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నిర్జీవంగా మారిపోతుంది. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా సరైన చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా వదిలిస్తారు. మరికొందరు అధిక రసాయనాలు కలిగిన మార్కెట్లలో దొరికే క్రీములను ముఖానికి రాసుకుంటారు కానీ, ఇవి అంత ప్రభావవంతంగా పనిచేయవు.ముఖ్యంగా రాత్రి సమయాల్లో మీ ముఖంపై ఏదైనా మేకప్ ఉంటే వెంటనే తొలగించండి.. అలాగే పడుకుంటే త్వరగా ముఖం పాడవుతుంది. దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. లేకపోతే కొబ్బరినూనె సహాయంతో కూడా మేకప్ ను తొలగించాలి. ఆ తర్వాతే ముఖానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖంపై మచ్చలు వస్తాయి.

ఇదీ చదవండి: ఏసీ, ఫ్యాన్ రెండూ కలిపి ఆన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?  

రాత్రి మాత్రమే కాదు ఉదయం సమయంలో కూడా మంచి మన్నికైన ఫేస్ వాష్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అయితే, రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. ముఖానికి ఆలివ్ ఆయిల్ రుద్దుకోవాలి లేదా ఆలివ్ ఆయిల్, విటమిన్ ఇ, కొబ్బరినూనె కలిపి ముఖంపై రుద్దుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఉదయం సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి.

ఇదీ చదవండి: అండర్ ఆర్మ్ స్కిన్ నలుపుని సింపుల్ గా పోగొట్టండి ఇలా!  

అంతేకాదు రాత్రి నిద్రపోయే సమయంలో గులాబీ రేకులు, కొబ్బరినూనె, బాదం నూనె కలిపి ముఖంపై రాత్రి పడుకునే ముందు మర్దన చేసుకోవాలి. గ్రీన్ టీ కూడా ముఖం ప్రభావవంతంగా పనిచేస్తుంది. కళ్లపై వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను పెట్టుకుంటే డార్క్‌ సర్కిల్ సమస్య తగ్గుతుంది. కళ్లు కూడా ఎండ వేడిమి నుంచి చల్లదనాన్నిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News