Summer Weight Loss Tips: వేసవిలో బరువు తగ్గడం చాలా సులభం.. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది ఆహారాలకు బదులుగా ఎక్కువగా నీటిని తీసుకుంటారు. దీని కారణంగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే చాలా మంది ఈ సమయంలో నీటిని తీసుకోవడం మానుకుంటారు. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్యల బారిన పడతారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తూ వెయిట్ కంట్రోల్ టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వేసవి కాలంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్కలంగా నీటిని తాగాలి:
వేడి వాతావరణంలో శరీరం నిర్జలీకరణం కాకుండా ఉండటానికి ఎక్కువగా నీరు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నీటిని ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
తేలికపాటి ఆహారం తీసుకోండి:
బరువు తగ్గాలనుకునేవారు వేసవి కాలంలో తప్పకుండా తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ప్రతి రోజు పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు వంటి తేలికపాటి పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి:
వేసవి కాలంలో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా పొట్టను నిండుగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినొద్దు:
చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు కేలరీలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి పోషకాలు తక్కువ మోతాదులో లభించే ఆహారాలు ఎండకాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటాయి.
భోజనం చేయడం మానుకోకండి:
వేసవిలో బరువు తగ్గడానికి చాలా మంది ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామాలు కూడా చాలా అవసరం:
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం పూట లేదా సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు వ్యాయామం చేయండి. అయితే ఎండలో వ్యాయామం చేయడం వల్ల అలసట, నిర్జలీకరణ వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామాలు చేయడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter