Venkatesh: ఇరువురి భామల కౌగిలో వెంకటేష్.. చాలా కాలం తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా వెంకీ మామ..

Venkatesh: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గినా.. ఒకపుడు మన హీరోలు ఇరువురి భామలతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. తాజాగా వెంకీ మామ.. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కోసం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారిపోతున్నాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2024, 02:14 PM IST
 Venkatesh: ఇరువురి భామల కౌగిలో వెంకటేష్.. చాలా కాలం తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా వెంకీ మామ..

Venkatesh: సిని ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో సినిమా హిట్టైయిందంటే ఆ కాంబినేషన్‌కు ఉండే క్రేజే వేరప్ప. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌ను రిపీట్ చేయబోతున్నారు వెంకటేష్. తనకు గతంలో రెండు సక్సెస్‌లు ఇచ్చిన అనిల్ రావిపూడితో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం విశేషం.

వెంకటేష్ విషయానికొస్తే..  ఈ యేడాది సంక్రాంతి కానుకగా 'సైంధవ్‌' అంటూ స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టేనర్‌తో పలకరించారు. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా.. సంక్రాంతి సినిమాల్లో శాండ్‌విచ్ అయిపోయింది. విడుదలైన ఒక రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చాప చుట్టేసింది. 'సైంధవ్‌' మూవీ గతేడాది చివర్లో విడుదల కావాల్సింది. కానీ ప్రభాస్ 'సలార్' కారణంగా  సంక్రాంతి వంటి తీవ్ర పోటీలో విడుదలైంది. అయితే పండగ సీజన్‌లో   హనుమాన్, గుంటూరు కారం వంటి సినిమాలతో పాటు నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాలతో పోటీగా విడుదలైంది. ఈ సినిమాల మధ్య సైంధవ్ పూర్తిగా నలిగిపోయింది.

ఆ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్ ఇపుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో మరో మూవీకి ఓకే చెప్పినట్టు సమాచారం. ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీల తర్వాత రాబోతున్న మూడో ఫ్రాంఛైజీగా ఈ మూవీ రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే F3లో సినిమా చివరల్లో ఈ సినిమాకు మూడో సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అందుకు తగ్గట్టే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడట. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. దాదాపు 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' టైపులో ఈ సినిమా ఉండబోతుందట. ఇందులో ఒక హీరోయిన్‌గా త్రిష ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. మరో కథానాయికగా ఎవరిని తీసుకుంటారా అనేద చూడాలి. 

చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్త పాత్రలో నటిస్తున్నాడు. మన చట్టాల ప్రకారం ఒక భార్య ఉండగా.. మరో భార్యను పెళ్లి చేసుకోవడం నేరం. మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం కానీ.. ఆమె ఒప్పకుంటే కానీ రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. మన సినిమాల్లో హీరో ఏదో తప్పని సరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకున్నట్టు చాలా సినిమాల్లో చూపించారు. ఇపుడు వెంకటేష్‌తో  చేయబోతున్న సినిమాలో అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారా.. లేదా అనేది చూడాలి.

ఇక వెంకటేష్ నటించిన సైంధవ్ విషయానికొస్తే.. ఈ మూవీలో యాక్షన్ కమ్ పాప సెంటిమెంట్ ఎక్కువగా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. మరోవైపు ఈ సినిమాలో  ఉన్న విపరీతమైన హింస కారణంగా ఈ చిత్రం సంక్రాంతి పోటీలో అడ్డంగా బుక్కైపోయింది.తన బేస్ కుటుంబ ప్రేక్షకులకు దూరంగా ఈ సినిమా ఉండటం సైంధవ్‌కు ప్రతిబంధకంగా మారింది.

ఇక 'సైంధవ్' సినిమా వెంకటేష్ కు 75వ సినిమా. తన లాండ్ మార్క్ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా  తెరకెక్కించినా.. హీరోకు విలన్స్ ఎందుకు భయపడతారనే విషయాన్ని తెరపై కన్విన్స్‌గా చెప్పడంలో తడబడ్డాడు.  తన గత రెండు చిత్రాలు 'హిట్ -1, హిట్ -2 చిత్రాలను పోలీస్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించిన శైలేష్ కొలను.. ఈ చిత్రాన్ని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించాడు.  అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ముఖ్యంగా ఇలాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్‌లను ఏ సినిమా పోటీలో లేకుండా విడిగా ఏ పోటీ లేకుండా రిలీజ్ చేస్తే మంచి ప్రయోజనం అయినా దక్కేది. కానీ సంక్రాంతి సీజన్ అంటూ ఎగబడి మొత్తానికి ఎసరు తెచ్చుకున్నారు.ఏది ఏమైనా తన కెరీర్‌లో లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనున్న 'సైంధవ్' వెంకటేష్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మూవీలో ఇతర ముఖ్యపాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, ముఖేష్ రుషి, జిషుసేన్ గుప్తా నటించారు. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్,రుహాని శర్మ ఫీమేల్ లీడ్ పాత్రల్లో కనిపించారు. మొత్తంగా రూ. 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం రూ. 10 కోట్ల షేర్ రాబట్టలేపోయింది. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి అనిల్ రావిపూడితో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యాడా ? లేదా అనేది చూడాలి.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News