Tulasi Vastu Tips: హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి మొక్క ఎంతో పవిత్రమైంది. లక్ష్మీదేవిగా పూజలు చేస్తాం. అంతేకాదు ఇది విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరం. అందుకే ఆయన పూజలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు మన ఇంట్లో ఉండే తులసి మొక్క నల్లగా మారితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
సీజన్ అనుసరించి తులసి మొక్క ఆకులు రాలిపోవడం మళ్లీ తిరిగి పెరగడం జరుగుతుంది. అయితే, ఒక్కోసారి పచ్చని తులసి ఆకులు హఠాత్తుగా నల్లగా మాడిపోతాయి. అది చూసి మనం కంగారు పడతాం. అయితే, తులసి మొక్క ఇలా నల్లబడటం వెనుక వాస్తు దోషాలను కూడా సూచిస్తుందని వాస్త్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసిమొక్క ఇలా నల్లగా మారితే ఇంట్లోకి నెగిటివిటీ కూడా పెరుగుతుందని అర్థం.
అంతేకాదు వాస్తు ప్రకారం తులసి మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజూ తులసిమొక్కను జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా దాని దిశకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు ప్రకారం తులసిమొక్క ఇంటికి తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఇతర ముళ్ల చెట్టు వంటి మొక్కల పక్కన పెట్టకూడదు.
ఇదీ చదవండి: Spiritual: రావిచెట్టుకు ఈ ఒక్క వస్తువు సమర్పిస్తే మీకు అన్ని పనుల్లో విజయం తథ్యం..
అయితే, ఇలా తులసి మొక్క ఇంట్లో హఠాత్తుగా నల్లగా మారిపోతే ఆ ఇంటికి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థమట. వాస్తు ప్రకారం మన ఇంటికి మంచి రోజులు వస్తే కూడా మొక్క పచ్చగా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటికి ఆర్థిక సంక్షోభం లేదా ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతే తులసి వాడిపోతుంది. తులసి వాడిపోయిన వెంటనే ఆ కుండీలో మరో మొక్కను నాటుకోవడం శుభం.
ఇదీ చదవండి: ఈ 5 రాశులవారు తమ భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు.. మీ రాశి కూడా ఇదేనా?
తులసిమొక్కను ఏర్పాటు చేసుకుంటే వాస్తు ప్రకారం ఆ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. కానీ, ఎట్టిపరిస్థితుల్లో సంధ్యకాలంలో తులసి మొక్క ఆకులు తొలగించకూడదు. అంతేకాదు, ఏకాదశి, ఆదివారం రోజుల్లో తులసిమొక్కకు నీరు పోయకూడదు. ఈరోజుల్లో అమ్మవారు ఉపవాసం ఉంటుందని నమ్మకం ఉంది. తులసి మొక్కను ఇతరులకు బహుమతిగా ఇస్తే అది అర్హులైనవారికి మాత్రమే ఇవ్వాలి. నిత్యం తులసిమాత పూజ చేసే వారికి మాత్రమే ఈ మొక్కను గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తులసి మొక్కలో రామతులసి, కృష్ణతులసి రెండు రకాలు ఉంటాయి. ఇందులో ఏది మన ఇంట్లో పెట్టుకున్నా ఆర్థిక నష్టాలు తొలగిపోయి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook