Supreme Court: ఎస్సీ వర్గీకరణపై 'సుప్రీం' తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఏం జరుగుతుందో..?

SC Communities Classification: ఎస్సీ వర్గీకరణ అంశం తుది దశకు చేరుకున్నటు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటుచేయడంతో వర్గీకరణ ఆశలు చిగురిస్తుండగా కేవలం ఒకే ఒక అడ్డంకి ఉంది. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం విచారణలో ఉంది. విచారణ ప్రారంభమవగా.. రెండో రోజు కూడా విచారణ సాగుతుండడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 6, 2024, 11:37 PM IST
Supreme Court: ఎస్సీ వర్గీకరణపై 'సుప్రీం' తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఏం జరుగుతుందో..?

SC Classification Issue: ఎస్సీ వర్గీకరణ విషయం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై మంగళవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్గీకరణ చట్టబద్దత మీద ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించగా.. బుధవారం కూడా దీనిపై చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ పంజాబ్ ప్రభుత్వం తరుపున ఇద్దరు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు కొనసాగాయి. తదుపరి విచారణ రేపు కొనసాగిస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచుడ్ ప్రకటించి వాయిదా వేశారు.

Also Read: Imran Khan: బతకడం కోసం లగ్జరీ కారును అమ్మేసుకున్న ఒకప్పటి స్టార్‌ హీరో

కాగా, ఎస్సీ వర్గీకరణపై దశాబ్దాల పాటు పోరాటం చేస్తున్న ఎమ్‌ఆర్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఈ విచారణను ప్రత్యక్షంగా విన్నారు. మంద కృష్ణ వాదనలు కొనసాగుతున్నంత సేపు న్యాయస్థానంలో ఉన్నారు. పంజాబ్ తో పాటు ఎస్సీ వర్గీకరణను బలపరుస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన న్యాయవాదులు, ఎమ్‌ఆర్‌పీఎస్‌ న్యాయవాదులను ఒక బృందంగా మందకృష్ణ సమన్వయం చేస్తున్నారు. కాగా వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల మహానాడు నాయకులు కూడా సుప్రీంకోర్టుకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.

Also Read: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు

ఈ విచారణపై ఎమ్మార్పీఎస్‌, మాదిగ సమాజం భారీ ఆశలు పెట్టుకుంది. వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానం అడ్డు తగిలితే తమ ఆశలు అడియాశలవుతాయనే ఆందోళనలో ఉన్నారు. ఈ సందర్భంగా విచారణపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్గీకరణ అంశంపై జరిగిన విచారణ సమయంలో హైదరాబాద్‌కు చెందిన మాదిగ ప్రతినిధి డప్పు మల్లికార్జున్ మాదిగ సుప్రీంకోర్టులో ఉన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు. 'వర్గీకరణ అంశంపై విచారణ ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ విచారణకు నిర్దిష్ట కాలపరిమితి ఎంత అనేది ఇంకా తెలియదు. రోజుల తరబడి చేసే జాప్యం చేసే విచారణ కూడా కాదు. త్వరగా విచారణ పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంటే న్యాయానికి నిదర్శనం. కనుక న్యాయమే గెలుస్తుందని విశ్వసిస్తున్నాం' అని ధీమా వ్యక్తం చేశారు.

దశాబ్దాల వర్గీకరణ కల 
షెడ్యూల్‌ కులాన్ని ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాలని వస్తున్న వర్గీకరణ డిమాండ్‌ దశాబ్దాల నాటిది. దశాబ్దాల కాలంగా వర్గీకరణ కోసం ఉదయమాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముప్పై సంవత్సరాలకు పైగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇటీవల వర్గీకరణ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఓ బహిరంగ సభలో 'వర్గీకరణపై కమిటీ' అని ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక కమిటీ ఏర్పాటైంది. అయితే వర్గీకరణ వద్దంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజాగా విచారణ మొదలైంది. నేడు కూడా విచారణ చేపడుతుండడంతో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News