Hanuman Collections: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన రెండవ సినిమా హనుమాన్. వీళ్ళిద్దరి మొదటి సినిమా జాంబీ రెడ్డి మంచి విజయం సాధించగా ఇప్పుడు హనుమాన్ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతోంది. హనుమాన్ చిత్రం టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ చిత్రం సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతోంది అని తెలిసినప్పుడు మాత్రం ప్రేక్షకులలో కొంచెం అనుమానాలు కలిగాయి. ఆ అనుమానాలు అన్నీ క్లియర్ చేస్తూ.. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు దాటి కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది హనుమాన్ చిత్రం.
బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఊహకందని రేంజ్ లో ట్రెండ్ అవుతోంది… తెలుగు రాష్ట్రాల్లో చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న కానీ ఆ థియేటర్స్ అన్నిటిలో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో దుమ్ము దులుపుతోంది. మొదటి రోజే దాదాపు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. కాగా.. ఈ చిత్రాన్ని దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో ఈ చిత్రం ఏకంగా 55% పెరుగుదల కనబరిచింది అని సమాచారం. శనివారం రూ. 12.52 కోట్లు వసూలు చేసిందట ఈ చిత్రం. ఇందులో తెలుగు వెర్షన్ నుంచి రూ. 8.5 కోట్లు, హిందీ వెర్షన్ నుంచి రూ. 4.12 కోట్లు వచ్చాయి. ఇండియాలో రూ. 14.06 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 9.34 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.23.5 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇలా మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ పరంగా మరింత దూసుకుపోయింది ఈ సినిమా.
ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని సైతం వెనక్కి నెట్టి హవా కొనసాగిస్తోంది. హిందీ లో కూడా తెగ జోరు చూపిస్తున్న ఈ సినిమా టోటల్ గా 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 8-10 కోట్ల రేంజ్ లో షేర్ ని.. 23 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని త్రేడ్ వర్గాల సమాచారం. అన్ని చోట్లా లెక్కలు అంచనాలను మించిపోతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మరి ఈ చిత్రం టోటల్ గా వీకెండ్ ముగిసే సరికి ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలి అంతే మాత్రం రేపటి వరకు వేచి చూడాలి.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook