Corona New Variant Jn.1 Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 భవిష్యత్తులో ప్రమాదకరంగా మారనుందా

Corona New Variant Jn.1 Threat: కరోనా మహమ్మారి నుంచి తేరుకున్న ప్రపంచానికి మరో సవాలు ఎదురు కానుంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 సంక్రమణ దిగులు పుట్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ భవిష్యత్తులో మరింత ప్రమాదకరం కావచ్చనే సంకేతాలు ఆందోళన రేపుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2024, 01:21 PM IST
Corona New Variant Jn.1 Threat: కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 భవిష్యత్తులో ప్రమాదకరంగా మారనుందా

Corona New Variant Jn.1 Threat: ఒమిక్రాన్ నుంచి పుట్టుకొచ్చి ప్రపంచంలో మరోసారి కలకలం రేపుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 గురించి వెలువడుతున్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ అంత ప్రమాదకరం కాదని చెబుతున్నా భవిష్యత్తులో మాత్రం ప్రమాదం కల్గించవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

ప్రపంచంలో ఇప్పుడు మరోసారి కరోనా సంక్రమణ భయం వెంటాడుతోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 ఇప్పటికే సింగపూర్ సహా కొన్ని దేశాల్ని కలవరపెడుతోంది. ఇండియాలో కూడా ఈ కొత్త వేరియంట్ ప్రవేశించింది. కొత్త వేరియంట్ జేఎన్.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తీవ్రత ఉండదని ఇప్పటి వరకూ వైద్యులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా ఈ కొత్త వేరియంట్ గురించి వెలుగుచూస్తున్న అంశాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు కరోనా కొత్త వేరియంట్ గురించి ఆందోళన కల్గించే అంశాలు వెల్లడించారు. కొత్త వేరియంట్ భవిష్యత్తులో కచ్చితంగా తీవ్ర పరిణామం రేపవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

జేఎన్.1 వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది. ఇప్పటికే 41 దేశాల్లో వ్యాపించి ఉంది. ఈ కొత్త వేరియంట్ శ్వాసకోశ వ్యాధులకు కారణమౌతోంది. జేఎన్.1 అనేది బీఏ.2.86 నుంచి పుట్టుకొచ్చింది. 2023 ఆగస్టు 25వ తేదీన తొలిసారిగా ఈ వైరస్ వెలుగుచూసింది. జేఎన్.1 స్పైక్ ప్రోటీన్‌లో అదనపు ఎల్455ఎస్ మ్యూటేషన్ కలిగి ఉండటం వల్ల మరింత ప్రమాదకరంగా మారగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 

జేఎన్.1 వైరస్ కరోనా వైరస్ క్రమంలో తీవ్ర పరిణామం కలిగిందిగా భావిస్తున్నారు. కరోనా శకం ఇంకా ముగియలేదని మిన్నెసోటా యూనివర్శిటీ అధ్యాపకులు వెల్లడించారు. జేఎన్.1 అనేది అనేక మార్పులతో కూడిన వేరియంట్ అని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అందుకే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ వేరియంట్ నుంచి అనేక ఇతర వేరియంట్‌లు పుట్టుకొచ్చే పమాదముందని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ను అంత తేలిగ్గా తీసుకోవద్దని వెల్లడిస్తున్నారు. 

కరోనా వైరస్ ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్ తరువాత జేఎన్.1 అనేది కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ వైరస్ తదుపరి వేరియంట్‌లు ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 నుంచి రావచ్చని అంచనా వేస్తున్నారు. 

Also read: Kesineni Nani: టీడీపీకు రాజీనామా చేయనున్న కేశినేని నాని, వైసీపీలో చేరనున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News