Menopause Diet: మహిళల్లో 40-45 ఏళ్ల తర్వాత పీరియడ్స్ ఆగిపోవడాన్ని వైద్య భాషలో మెనోపాజ్ అంటారు. ఇది ప్రతి స్త్రీలో జరిగే శారీరక ప్రక్రియ..ఇలాంటి ప్రక్రియ జరిగే క్రమంలో చాలా మంది శరీరాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయాల్లో తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
మెనోపాజ్ సమయంలో మహిళల్లో మానసిక మార్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందైతే..బరువు పెరగడం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఒత్తిడి, జుట్టు రాలడం, కండరాలు బలహీనపడటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరికొంతమందిలో జీర్ణక్రయపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి:
మెనోపాజ్ సమయంలో స్త్రీలు తప్పకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు అధిక పరిమాణాల్లో పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా రుతువిరతి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో సాల్మన్, మాకేరెల్ చేపలను తీసుకోవాల్సి ఉంటుంది.
పండ్లు, కూరగాయలు తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలి:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా పండ్లు, కూరగాయలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రుతుక్రమం ఆగిన మహిళలైతే తప్పకుండా విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
తృణధాన్యాలు:
తృణధాన్యాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, విటమిన్ బి, థయామిన్, నియాసిన్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మెనోపాజ్ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో తృణధాన్యాలను తీసుకోవాల్సి ఉంటుంది.
పాల ఉత్పత్తులు:
రుతువిరతి సమయంలో మహిళల్లో ఎముక సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు కాఫీ, టీలకు బదులుగా మిల్క్ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..