Rocky Aur Rani ki Prem Kahani: ఓటీటీలోకి వచ్చేసిన ర‌ణ్‌వీర్ నయా మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Bollywood: ర‌ణ్‌వీర్ సింగ్ నయా మూవీ 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని'. కరణ్‌ జోహర్‌ తెరకెక్కించిన ఈ మూవీలో ఆలియా భ‌ట్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 02:17 PM IST
Rocky Aur Rani ki Prem Kahani: ఓటీటీలోకి వచ్చేసిన ర‌ణ్‌వీర్ నయా మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Rocky Aur Rani ki Prem Kahani Movie On OTT: బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), ఆలియా భ‌ట్ (Alia Bhat) కాంబోలో వచ్చిన నయా మూవీ 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌ కహాని'’(Rocky Aur Rani Kii Prem Kahaani). ఈ మూవీకి స్టార్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహర్‌ (Karan johar) దర్శకత్వం వహించాడు. దాదాపు ఏడేళ్లు తర్వాత ఈ మూవీతోనే మెగాఫోన్‌ పట్టి సూపర్ హిట్ కొట్టాడు కరణ్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రం రూ. 300 కోట్లుపైగా కలెక్ట్ చేసింది. కరణ్ బాలీవుడ్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీని రూపొందించాడు. 

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. పే ఫర్‌ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఈ సినిమా చూడాలంటే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వాళ్లు అదనంగా రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఒక్క సారి రెంట్ తీసుకుంటే కేవలం 48 గంటల్లోపే సినిమాను వీక్షించే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పద్దతిని తీసేసి ప్ర‌స్తుతం ఉచితంగా అందుబాటులో ఉంచింది అమెజాన్ ప్రైమ్. . ఇక పై ఈ మూవీ  ఫ్రీగా చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, షభానా ఆజ్మీ, జయా బచ్చన్, తోటా రాయ్ చౌదరి తదితరులు కీ రోల్స్ చేశారు. 

Also Read: Bedurulanka OTT: చడిచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన కార్తికేయ 'బెదురులంక'.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News