Irfan Pathan: ఎట్టకేలకు టీమ్ ఇండియా వెస్టిండీస్‌పై మూడవ టీ20లో విజయం సాధించింది. సిరీస్ 3-0 కాకుండా ఇంకా పోటీలో ఉండే అవకాశం లభించింది. టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మూడవ టీ20లో జరిగిన ఆ సంఘటన జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు గుప్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియా-వెస్టిండీస్ మూడవ టీ20 మ్యాచ్‌లో ఇండియా ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జరిగిన ఆ సంఘటనపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ కచ్చితంగా జట్టు రథ సారధి హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసిందేనని విమర్శిస్తున్నారు. గత కొద్దికాలంగా ఓవరాక్షన్ చేస్తున్న హార్దిక్ పాండ్యాకు ఇర్ఫాన్ పఠాన్ గట్టి కౌంటర్ ఇచ్చాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనంతటికీ కారణం తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ అవకాశం చేజారడానికి హార్దిక్ పాండ్యా కారణం కావడమే. స్వార్ధంతో వ్యవహరించడం వల్లనే తిలక్ వర్మకు తృటిలో అర్ధ సెంచరీ మిస్సయింది.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మూడవ టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్డిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లు వెస్టిండీస్‌ను 159 పరుగులకు కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆ తరువాత 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ ఇండియా ఆరంభంలో మరోసారి తడబడింది. యశస్వీ జైశ్వాల్, శుభమన్ గిల్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడంతో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ అద్భుతంగా ఆడి జట్టుని గెలిపించారు. సూర్య కుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 83 పరుగులు చేసి విజయానికి చేరువకు తీసుకొచ్చి అవుట్ అవడంతో అతడి స్థానంలో హార్దిక్ బరిలో దిగాడు.
ఈలోగా తిలక్ వర్మ కూడా అద్భుతంగా ఆడుతూ 49 పరుగులు చేశాడు. మరో 13 బంతులు మిగిలున్నాయి. జట్టు విజయానికి కావల్సింది 1 పరుగు మాత్రమే. ఆ సమయంలో స్టైకింగ్ తిలక్ వర్మకు ఇచ్చుంటే అతని హాఫ్ సెంచరీ, జట్టు విజయం రెండూ పూర్తయ్యేవి. కానీ హార్దిక్ పాండ్యా స్వార్దంతో వ్యవహరించి స్ట్రైకింగ్ తాను తీసుకోవడంతో తిలక్ వర్మకు హాఫ్ సెంచరీ అవకాశం తప్పింది. ఒకవేళ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసుంటే కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఘనత దక్కేది.
అందుకే ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కష్టంగా ఉన్న పని మీరు చేయండి, సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా..ఇదెక్కడో విన్నట్టుంది కదూ..అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి చేసినవేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్‌గా మొదట్నించీ ఓవరాక్షన్ చేస్తున్న హార్దిక్ పాండ్యాకు మంచి కౌంటర్ ఇచ్చారంటూ ప్రశంసిస్తున్నారు.
ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఇండియాకు తొలి రెండు టీ20ల్లో పరాభవం ఎదురైంది. ట్రినిడాడ్‌లో 4 పరుగుల తేడాతో, గయానాలో 2 వికెట్ల తేడాతో ఇండియా పరాజయం పాలైంది. మూడవ మ్యాచ్ విజయంతో సిరీస్ వెస్టిండీస్‌కు దక్కకుండా ఇంకా ఆశలు సజీవంగా ఉండటానికి వీలైంది.
Also read: World Cup 22023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ మారింది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook