Lemon Peel Powder Benefits For Weight Loss: బరువు తగ్గడానికి చాలామంది పడరాని పాట్లు పడుతున్నారు. కొంతమంది అయితే నిద్ర ఆహారాలు మానేసి జిమ్ లో కష్టపడి వ్యాయామాలు చేస్తున్నారు. అంతేకాకుండా డైట్ పద్ధతిలో కూడా ఆహారాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే మీ శరీర బరువును సులభంగా తగ్గించుకోవడానికి మేము ఈరోజు ఆయుర్వేద చిట్కాని చెప్పబోతున్నాం. ఈ చిట్కాను పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
శరీర బరువును వేగంగా తగ్గించుకోవడానికి నిమ్మకాయ తొక్క కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడమే కాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభావవంతంగా పనిచేస్తాయట. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఈ తొక్కతో తయారుచేసిన కషాయాన్ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ తొక్కలో ఉండే గుణాలు చర్మ సమస్యలను కూడా సులభంగా తగ్గిస్తాయి. అయితే ఈ నిమ్మ తొక్క రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
నిమ్మ తొక్క రసాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు నిమ్మ తొక్కలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని ఓ బౌల్లో వేసి రెండు కప్పుల నీటిని వేసి బాగా మరిగించుకోవాలి. రెండు కప్పుల నీరు ఒక కప్పు అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మరిగించుకున్న నీటిని వడబోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా శరీర బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఈ నిమ్మ తొక్క కషాయం శరీర బరువును తగ్గించడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాలను కూడా సులభంగా కరిగిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించి మధుమేహం సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. దీనిని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రోజుకు ఒక కప్పు చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook